సెమీస్​లో హాకీ వీరులు

సెమీస్​లో హాకీ వీరులు
  • క్వార్టర్స్‌‌లో గ్రేట్‌‌ బ్రిటన్‌‌పై ఇండియా విక్టరీ
  • రేపు వరల్డ్‌‌ చాంప్‌‌ బెల్జియంతో ఢీ.. గెలిస్తే మెడల్‌‌ గ్యారంటీ

టోక్యో: ఒలింపిక్స్‌‌లో ఇండియా మెన్స్‌‌ హాకీ టీమ్‌‌ జోరు కొనసాగుతోంది. 49 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌‌లో సెమీఫైనల్‌‌కు అర్హత సాధించి మెడల్‌‌కు మరింత దగ్గరైంది. నిజానికి 1980 మాస్కో గేమ్స్‌‌లో ఇండియా గోల్డ్‌‌ మెడల్‌‌ గెలిచింది. కానీ, అప్పుడు కేవలం ఆరు జట్లు మాత్రమే బరిలో ఉండటంతో సెమీఫైనల్‌‌ లేదు. దాంతో 1972 మ్యూనిచ్‌‌ గేమ్స్‌‌లో చివరిగా సెమీఫైనల్‌‌ ఆడిన ఇండియా 49 ఏళ్ల తర్వాత తిరిగి టోక్యోలో  లాస్ట్‌‌–4 స్టేజ్‌‌కు చేరినట్టు అయ్యింది.  ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో మన్‌‌ప్రీత్‌‌సింగ్‌‌ కెప్టెన్సీలోని ఇండియా 3–1తో గ్రేట్‌‌ బ్రిటన్‌‌పై తిరుగులేని విజయం సాధించింది. దిల్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌(7వ నిమిషం), గుర్జాంత్‌‌ సింగ్‌‌(16వ ని.), హార్దిక్‌‌ సింగ్‌‌(57వ ని.) ఇండియాకు గోల్స్‌‌ అందించారు. గోల్‌‌ కీపర్‌‌ శ్రీజేశ్‌‌.. ప్రత్యర్థి ప్రయత్నాలను పలుమార్లు అడ్డుకుని జట్టు విజయంలో కీరోల్‌‌ పోషించాడు.  విక్టరీ తర్వాత కెప్టెన్‌‌ మన్‌‌ప్రీత్‌‌ సహా ప్లేయర్లంతా ఆనందంతో కంటతడి పెట్టారు. ఒకరినొకరు కౌగిలించుకుని విషెస్‌‌ చెప్పుకున్నారు. కాగా, మంగళవారం జరిగే సెమీఫైనల్లో వరల్డ్‌‌ చాంపియన్‌‌ బెల్జియంతో ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌‌లో గెలిస్తే  ఫైనల్‌‌ చేరడంతోపాటు ఇండియాకు మెడల్‌‌ ఖాయమవుతుంది. ఒకవేళ ఓడితే బ్రాంజ్‌‌ మెడల్‌‌ మ్యాచ్‌‌ ఆడాల్సి ఉంటుంది.