
2023-2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో టీమిండియా కథ ముగిసింది. తొలి రెండు సార్లు ఫైనల్ కు చేరిన భారత క్రికెట్ జట్టు మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకోవడంలో విఫలమైంది. ఇక ఇప్పుడు 2025-27 టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పై దృష్టి పెట్టనుంది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ లో జరగబోయే 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ తో భారత్ 2025-27 టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్ ను ప్రారంభిస్తుంది. రానున్న రెండు సంవత్సరాలకు భారత టెస్ట్ షెడ్యూల్ వచ్చేసింది. ఇందులో భాగంగా మొత్తం 18 టెస్టులు ఆడనుంది.
సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లపై భారత్ సొంతగడ్డపై టెస్ట్ సిరీస్ ఆడనుంది. అదే విధంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంకతో విదేశాల్లో టెస్ట్ సిరీస్ లు జరగనున్నాయి. మొదటగా 2025 లో ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ ఇంగ్లాండ్ లో జరగనుంది. వెస్టిండీస్ తో అక్టోబర్ లో.. ఆ తర్వాత నవంబర్ లో సౌతాఫ్రికాతో సొంతగడ్డపై సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత 8 నెలల పాటు భారత్ కు టెస్ట్ మ్యాచ్ లు లేవు.
2026 ఆగస్ట్ లో శ్రీలంకలో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్.. 2026 నవంబర్ లో న్యూజిలాండ్ తో వారి గడ్డపైనే రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. 2027 ప్రారంభంలో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్ వేదికగా జరగనుంది. 2025-27 టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భారత్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండానే ఆడబోతుంది. ఇటీవలే వీరిద్దరూ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో భారత్ పూర్తిగా యంగ్ ఇండియాతో బరిలోకి దిగబోతుంది.
2025-2027 భారత్ టెస్ట్ ఛాంపియన్ షిప్ షెడ్యూల్:
ఇండియా vs ఇంగ్లాండ్ (విదేశాల్లో) - 5 టెస్టులు - జూన్-ఆగస్టు 2025
ఇండియా vs వెస్టిండీస్ (స్వదేశం) - 2 టెస్ట్‌లు - అక్టోబర్ 2025
భారతదేశం vs దక్షిణాఫ్రికా (స్వదేశం) - 2 టెస్ట్‌లు - డిసెంబర్ 2025
భారత్ vs శ్రీలంక (విదేశాల్లో) - 2 టెస్టులు - ఆగస్టు 2026
భారత్ vs న్యూజిలాండ్ (విదేశాల్లో) - 2 టెస్టులు - అక్టోబర్-డిసెంబర్ 2026
ఇండియా vs ఆస్ట్రేలియా (స్వదేశం) - 5 టెస్టులు - జనవరి-ఫిబ్రవరి 2027
🚨Team India WTC Schedule 2025-27. 🇮🇳🇮🇳❤️❤️🙏🙏#WTC pic.twitter.com/M5tRD1IhyD
— Rsv official (@Raushan82499286) May 13, 2025