ఇండిగో విమానంలో సాంకేతిక లోపం

ఇండిగో విమానంలో సాంకేతిక లోపం

షార్జా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానం పాకిస్తాన్ లోని కరాచీ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది.  విమానంలో  సాంకేతిక లోపం ఉందని  పైలట్ కంప్లైంట్ చేయడంతో  ఇవాళ పాకిస్థాన్‌కు మళ్లించినట్లు ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. విమానాన్ని ముందుజాగ్రత్తగా కరాచీలో ల్యాండ్ చేశామని, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని తెలిపింది.  ఫ్లైట్ లో ఉన్న  ప్రయాణీకులను హైదరాబాద్‌కు తరలించడానికి కరాచీకి అదనపు విమానాన్ని పంపుతున్నట్లు ఎయిర్ లైన్స్ వెల్లడించింది. 

‘షార్జా నుంచి హైదరాబాద్‌కు వచ్చే ఇండిగో ఫ్లైట్ 6E-1406ని కరాచీకి మళ్లించారు. సాంకేతిక లోపాన్ని పైలట్ గమనించాడు.  ముందు జాగ్రత్త  విమానాన్ని కరాచీకి మళ్లించారు.ప్రయాణికులను హైదరాబాద్ తీసుకురావడానికి  అదనపు విమానాన్ని కరాచీకి పంపుతున్నారు.” అని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.  గత రెండు వారాల్లో కరాచీలో ల్యాండ్ అయిన రెండో భారతీయ విమానం ఇది. గత వారంలో స్పైజ్ జెట్ కు చెందిన ఢిల్లీ-దుబాయ్ విమానం సాంకేతిక లోపంతో కరాచీలో ల్యాండ్ అయ్యింది