- రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- వేములవాడ, మల్కపేటలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశానికి హాజరు
వేములవాడ/కోనరావుపేట, వెలుగు: ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు వరం లాంటివని వేములవాడ ఎమ్యెల్యే, ప్రభుత్వ విప్అది శ్రీనివాస్అన్నారు. ఆదివారం వేములవాడతోపాటు కోనరావుపేట మండలం మల్కపేటలో పలు ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి హాజరై వారికి నూతన వస్త్రాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరుపేదలు, బలహీన వర్గాలకు ఇంటి సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందన్నారు.
పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని, దశలవారీగా మరిన్ని కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. వేములవాడలో మున్సిపల్ చైర్పర్సన్ పుల్కం రాజు, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కాస శ్రీనివాస్, భారతి, గురువయ్య తదితరులు పాల్గొన్నారు. మల్కపేటలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కె.ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్, జిల్లా కార్యదర్శి గంగాధర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
