ఇందిరమ్మ ఇండ్ల తో పేదల కళ్లల్లో ఆనందం : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

ఇందిరమ్మ ఇండ్ల తో పేదల కళ్లల్లో ఆనందం : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

రాయికల్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లతో పేదల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని ఎమ్మెల్యే సంజయ్​కుమార్​అన్నారు. రాయికల్​మండలంలోని కిష్టంపేటలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న పెరుమాండ్ల రాజేశ్​గౌడ్, సంధ్య దంపతులు శనివారం గృహప్రవేశం నిర్వహించుకోగా.. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై, వారికి శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల నియోజకవర్గానికి ఇండ్లు మంజూరు చేసిన సీఎం రేవంత్​రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 

పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంలో తీరుతోందని తెలిపారు. అర్హులందరికీ రెండో విడతలో ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ అంజన్న గౌడ్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ జోగినిపెల్లి తిరుపతి గౌడ్, నాయకులు ఆదిరెడ్డి, సల్ల శేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్​సిరిపురం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

నృసింహుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం

భూపతిపూర్​లో శ్రీలక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాయికల్, మేడిపల్లి, జగిత్యాల, మల్లాపూర్​ మండలాలకు చెందిన భక్తులు తరలివచ్చి, పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్​ సంజయ్​కుమార్​ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడ అర్చకుడు వేముగంటి గిరిధరాచార్యులు, ఉపసర్పంచ్ సంజీవచారి, నాయకులు మహేందర్​గౌడ్, చంద్రశేఖర్, ముత్యంరెడ్డి, శేఖర్​రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.