అర్హులైన ప్రతీ ఒక్కరికి ‘ఇందిరమ్మ ఇండ్లు’ : డీసీసీ చీఫ్ బీర్ల అయి లయ్య

అర్హులైన ప్రతీ ఒక్కరికి ‘ఇందిరమ్మ ఇండ్లు’ : డీసీసీ చీఫ్ బీర్ల అయి లయ్య

యాదగిరిగుట్ట, వెలుగు: ఇండ్లు లేని ప్రతీ నిరుపేదకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతొక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య తెలిపారు. గురువారం యాదగిరిగుట్టలోని గుండ్లపల్లికి చెందిన లబ్ధిదారుడు గుండ్లపల్లి సత్యం గౌడ్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ఆయన హాజరయ్యారు.   

లబ్ధిదారులకు పట్టుబట్టలు పెట్టి యాటపోతు కోసం నగదును ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ గుండ్లపల్లి భరత్ గౌడ్, కౌన్సిలర్లు ముక్కెర్ల మల్లేష్ యాదవ్, పేరబోయిన సత్యనారాయణ, బూడిద మధు, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు బందారపు బిక్షపతి తదితరులు ఉన్నారు.