రేపట్నుంచే (ఆగస్టు 28) ఇందిరమ్మ ఇండ్ల లక్కీ డ్రా..లాటరీ ఏ రోజు ఎక్కడంటే..

రేపట్నుంచే (ఆగస్టు 28) ఇందిరమ్మ ఇండ్ల లక్కీ డ్రా..లాటరీ ఏ రోజు ఎక్కడంటే..
  •     ఈ నెల 31 వరకు 16 నియోజకవర్గాల్లో లాటరీలు
  •     టీజీహెచ్‌‌బీ వెబ్‌‌సైట్‌‌, యూట్యూబ్‌‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం
  •     హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపికకు శుక్రవారం నుంచి ఈ నెల 31 వరకు లాటరీ నిర్వహించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్‌‌ చైర్మన్ వీపీ గౌతమ్ తెలిపారు. రోజుకు 4 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున 16 నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ చేపడతామని బుధవారం పేర్కొన్నారు. స్థలాభావం, భద్రతా కారణాల దృష్ట్యా లాటరీ కేంద్రాల్లోకి దరఖాస్తుదారులందరినీ అనుమతించలేమని చెప్పారు. కేంద్రాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసే స్క్రీన్లపై లాటరీని వీక్షించే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని టీజీహెచ్‌‌బీ వెబ్‌‌సైట్‌‌తో పాటు హౌసింగ్ డిపార్ట్‌‌మెంట్ సోషల్‌‌ మీడియా ఖాతాల్లోనూ చూడవచ్చని వివరించారు.ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే ఫ్లాట్ల కేటాయింపు ఉంటుందన్నారు. 

లాటరీ ఏ రోజు ఎక్కడంటే..

ఆగస్టు 28న కుత్బుల్లాపూర్‌‌(గాజులరామారం గండిమైసమ్మ ఫంక్షన్‌‌ హాల్‌‌), సికింద్రాబాద్‌‌ కంటోన్మెంట్‌‌(బోయినపల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్‌‌), రాజేంద్రనగర్‌‌(మైలార్‌‌దేవ్‌‌పల్లిలోని లక్ష్మీగుడి పొదుపు సంఘం హాల్‌‌), నాంపల్లి(రెడ్‌‌హిల్స్‌‌లోని వెట్స్‌‌ గార్డెన్‌‌), ఆగస్టు 29న ఖైరతాబాద్‌‌(కుమ్రంభీం ఆదివాసీ భవన్‌‌–సేవాలాల్‌‌ బంజారా భవన్‌‌), కూకట్‌‌పల్లి(కేపీహెచ్‌‌బీ కమ్యూనిటీ హాల్‌‌), అంబర్‌‌పేట(మహారాణా ప్రతాప్‌‌ ఫంక్షన్‌‌ హాల్‌‌), బహదూర్‌‌పుర(ఎస్‌‌డీఆర్‌‌ పెర్ల్‌‌ ప్యాలెస్‌‌), ఆగస్టు 30న శేరిలింగంపల్లి(గచ్చిబౌలిలోని నితమ్‌‌ కేంద్ర ప్రాంగణం), మలక్‌‌పేట(చంపాపేటలోని సాదియా ఫంక్షన్‌‌ హాల్‌‌), ఇబ్రహీంపట్నం(బండ్లగూడలోని రాజీవ్‌‌ స్వగృహ కమ్యూనిటీ హాల్‌‌), మేడ్చల్‌‌(పోచారం స్వగృహ కమ్యూనిటీ హాల్‌‌), ఆగస్టు 31న మల్కాజిగిరి(అల్వాల్‌‌లోని వీబీఆర్‌‌ గార్డెన్స్‌‌), సనత్‌‌నగర్‌‌(హెవన్‌‌ ప్యాలెస్‌‌ ఫంక్షన్‌‌ హాల్‌‌), మహేశ్వరం(బడంగ్‌‌పేట్‌‌ ప్రజాభవన్‌‌), కార్వాన్‌‌ (అంబర్‌‌పేటలోని సిటీ పోలీస్‌‌ లైన్ ప్రాంగణం)లో లాటరీ నిర్వహించనున్నారు.