- తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించనున్న శ్రీహిత
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి రాంపూర్ జడ్పీ హైస్కూల్లో టెన్త్ పూర్తి చేసిన పి. శ్రీహిత జాతీయ స్థాయి అంతరిక్ష వర్క్‌షాప్‌నకు ఎంపికైంది. తెలంగాణ నుంచి ఎంపికైన ఆమెను శుక్రవారం డీఈవో అశోక్ తన కార్యాలయంలో సన్మానించారు.
కేంద్రం నీతి అయోగ్ ఆధ్వర్యంలోని అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా 6 నుంచి 12 తరగతుల విద్యార్థినులకు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్‌లో ప్రాయోగిక శిక్షణ అందిస్తున్నారు. 2025 ఆగస్టు నుంచి ఆరు నెలల పాటు 120 గంటల ఆన్‌లైన్ శిక్షణ నిర్వహించి, ఇంటర్వ్యూల ద్వారా దేశవ్యాప్తంగా విద్యార్థులను ఎంపిక చేశారు. ఇందులో తెలంగాణ నుంచి శ్రీహిత ఎంపికైంది. టెన్త్ పాసైన శ్రీహిత ప్రస్తుతం పాలిసెట్ రాసి అడ్మిషన్ కోసం ఎదురుచూస్తోంది. ఆగస్టులో న్యూఢిల్లీలో 10 రోజుల పాటు జరిగే వర్క్‌షాప్‌లో పాల్గొని, అక్కడి నుంచి చాంద్రాయాన్4 శాటిలైట్ నిర్మాణ కార్యక్రమంలో ఇస్రో సహకారంతో భాగస్వామ్యం కానుంది.
