గోదావరి ఖనిలో సమాచార కమిషనర్ల పర్యటన

గోదావరి ఖనిలో సమాచార కమిషనర్ల పర్యటన

గోదావరిఖని, వెలుగు : గోదావరిఖనిలో బుధవారం రాష్ట్ర సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, దేశాల భూపాల్, మోహిసినా పర్వీన్​, బోరెడ్డి అయోధ్యరెడ్డి పర్యటించారు. రామగిరి మండలం సుందిళ్లలోని పురాతన లక్ష్మీనర్సింహస్వామి టెంపుల్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేక పూజలు చేశారు.

అలాగే సింగరేణి ఆర్జీ 1 ఏరియా పరిధిలోని జీడీకే 2ఏ భూగర్భ గనిని, జీడీకే ఓపెన్​ కాస్ట్​ 5 ప్రాజెక్ట్​ను సందర్శించి బొగ్గు ఉత్పత్తి, రవాణా, కార్మికుల పనివిధానంపై ఆర్జీ 1 ఏరియా జీఎం డి.లలిత్​ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు సింగరేణి ఇల్లందు క్లబ్​ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో క్యాలెండర్​ ఆవిష్కరించారు. వారి వెంట ఆఫీసర్లు కె.చంద్రశేఖర్, ఎ.ఆంజనేయులు, కె.మల్లేశం, డి.రమేశ్‌‌‌‌‌‌‌‌, అల్లావుద్దీన్, పి.శ్రీనివాస్,  బి.కర్ణ, వెంకటేశ్వర్లు, డి.చంద్రమౌళి,  వీరారెడ్డి, తదితరులున్నారు.