రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై గ్రీన్ ట్రిబ్యునల్‌లో విచారణ

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై గ్రీన్ ట్రిబ్యునల్‌లో విచారణ
చెన్నై: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై  ఇవాళ చెన్నైలోని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ జరిగింది. ట్రిబ్యునల్ తీర్పు ధిక్కరించి ప్రాజెక్టు పనులు సాగిస్తున్నారని పాలమూరు జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కంటెంప్ట్ పిటిషన్ పై జస్టిస్ రామకృష్ణన్, ఎక్స్పర్ట్ మెంబర్ సైబల్ దాస్ గుప్తలతో కూడిన బెంచ్ విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం ఎన్ జి టి కి సమాధానం ఇవ్వకుండా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు వేగంగా సాగిస్తున్నారని పిటిషనర్ ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా పేలుళ్లు కూడా జరుపుతూ.. పర్యావరణ ఉల్లంఘన చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్ కోర్టుకు తెలిపారు. కేవలం డీపీఆర్ రూపొందించడానికి అవసరమైన పరీక్షలు జరుపుతున్నామే తప్ప ప్రాజెక్టు పనులు చేపట్టడం లేదని ఏపీ న్యాయవాది వెంకట రమణి వివరణ ఇచ్చారు. ఎన్ జి టి కి వివరణ ఇవ్వకుండా పనులు చేపట్టడం భావ్యం కాదనని కోర్ట్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వ వివరణ తయారవుతోందని,  త్వరలోనే ఫైల్ చేస్తామని సీనియర్ న్యాయవాది వెంకట రమణి కోర్టుకు వివరించారు. ఏపీ తరపున సీనియర్ న్యాయవాది ఇచ్చిన వాగ్దానం మేరకు కేసును ఫిబ్రవరి 2వ తేదీ వరకు వాయిదా వేసింది ఎన్ జి టి కోర్టు. ఆలోపు ఆంధ్రప్రదేశ్ సమాధానం ఫైల్ చెయ్యాలని ఆదేశించింది. ఒకవేళ ఏపీ ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఆమోదయోగ్యంగా లేకపోతే తగిన ఆదేశాలు ఇస్తామని జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ఎన్ జి టి స్పష్టం చేసింది. ఇవి కూడా చదవండి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ అప్డేట్: కనిపించని వారితో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు జడ్చర్ల నుంచి జపాన్ వరకు.. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అన్నార్థుల ఆకలి తీర్చే ఆలయం ముల్లంగి ఒకటి రెండు ముక్కలతో సరిపెడుతున్నారా..? ఇది మీకోసమే