Shahid Kapoor: ప్రేమ పేరుతో ఇద్దరు హీరోయిన్స్ మోసం చేశారు.. షాహిద్ షాకింగ్ కామెంట్స్

Shahid Kapoor: ప్రేమ పేరుతో ఇద్దరు హీరోయిన్స్ మోసం చేశారు.. షాహిద్ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్(Shahid Kapoor) షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్ లవ్ స్టోరీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రేమపేరుతో తనను ఇద్దరు స్టార్స్ మోసం చేశారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం షాహిద్ చేసిన ఈ కామెంట్స్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. బాలీవడ్ నటి నేహా దుపియా ఓ టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ షోలో పాల్గొన్నాడు షాహిద్ కపూర్. ఇందులో భాగంగా నేహా దుపియా షాహిద్ ను ఎన్నిసార్లు ప్రేమలో మోసపోయావ్ అని ప్రశ్నించింది. దానికి సమాధానంగా.. ప్రేమ పేరుతో తనను ఇద్దరు మోసం చేశారని, వాటిలో ఒకదాని గురించి కచ్చితంగా చెప్పగలనని, రెండో దానిపై సందేహాలు ఉన్నాయని అన్నారు. వారి పేర్లు ఇప్పుడు ప్రస్తావించడం కరక్ట్ కాదని చెప్పుకొచ్చాడు. ఆ హీరోయిన్స్ పేర్లు నేను చెప్పన్నా అని నేహా అనగా... ఇంకో ప్రశ్న ఏదైనా అడగండి అంటూ దాటేశాడు షాహిద్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

ఇక షాహిద్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన రోషన్ ఆండ్రూ దర్శకత్వంలో దేవ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ.