తెలంగాణలో మే 24 నుండి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షలు

 తెలంగాణలో మే 24 నుండి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షలు

తెలంగాణలో మే 24 నుండి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షలు ప్రారంభం కానున్నాయి.  జూన్ ఒకటో తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.  ఈ మేరకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సెంకడియర్ పరీక్షలు జరగనున్నాయి. 

సప్లిమెంట‌రీ ప‌రీక్షలకు సంబంధించిన ప‌రీక్ష ఫీజును ఏప్రిల్ 25 నుంచి మే 2వ తేదీ వ‌ర‌కు ఆయా కాలేజీల్లో స్వీక‌రించ‌నున్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేష‌న్‌కు సంబంధించి కూడా ఇదే స‌మ‌యంలో ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేప‌ర్‌కు రూ. 100, రీకౌంటింగ్‌కు ఒక్కో పేప‌ర్‌కు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది.

Also Read:ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు

ఏప్రిల్ 24వ తేదీ ఉదయం ఇంటర్ ఫస్ట్, సెంకడియర్ ఫలితాలను అధికారులు విడుదల చేశారు.   ఈ ఏడాది 9.80 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఫస్టియర్ లో 60.01 శాతం, సెకండియర్ 64.19 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. రంగారెడ్డి జిల్లా టాప్ లో నిలిచింది.  2023 ఫ‌లితాల‌తో పోల్చితే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం స్వల్పంగా త‌గ్గింది.