ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు పూర్తికావడంతో విద్యార్థులు ఇంటి బాట పట్టారు. హాస్టళ్లలో ఉంటూ వివిధ కాలేజీల్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ పరీక్షలు ముగియడంతో మూటాముల్లె కట్టుకుని సొంతూళ్లకు పయనమయ్యారు. గత నెల 25న పరీక్షలు ప్రారంభం కాగా.. గురువారం ముగిశాయి. దీంతో తమ పిల్లలను తీసుకెళ్లేందుకు వివిధ గ్రామాల నుంచి తల్లిదండ్రులు హాస్టళ్ల వద్దకు చేరుకోవడంతో సందడి నెలకొంది. ఖమ్మం కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ వద్ద రద్దీ కనిపించింది. టూ వీలర్లు, ఇతర వాహనాలపై వచ్చిన పేరెంట్స్ సామగ్రి, పిల్లలను వెంటబెట్టుకుని ఇండ్లకు తీసుకెళ్లారు.
