తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఆకాష్ అనే ఇంటర్ విద్యార్ధి నడుముకి బండరాయి కట్టుకొని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ( మే 22 ) అర్థరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు ఆకాష్. ఆకాష్ మృతదేహం చంద్రగిరి కోట బావిలో లభ్యమైంది.
కువైట్ లో ఉన్న తల్లి సమాచారం ఇవ్వడంతో నిన్న రాత్రే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు పట్టారు. అయితే.. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిచిపోయాయి.
ఇవాళ గాలింపు చర్యలు ప్రారంభించిన పోలీసులు చంద్రగిరి కోట బావిలో ఆకాష్ మృతదేహాన్ని గుర్తించారు.మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు.ఆకాష్ తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి ఫోటోలు పంపించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.
