'టీ' గురించి చాలా మందికి తెలియని ఇంట్రస్టింగ్ విషయాలు

'టీ' గురించి చాలా మందికి తెలియని ఇంట్రస్టింగ్ విషయాలు

దేశంలో సామాన్యుల నుంచి అత్యంత సంపన్నుల వరకు ఎంతో సంతోషంగా ఆస్వాదించే టీ(Tea)కి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. రీసెంట్ డేస్ లో ఎన్నో రకాల టీలు, ఫ్లేవర్లు మార్కెట్లో లభిస్తుండగా.. ఒకప్పుడు మాత్రం టీ, కాఫీ మాత్రమే ఉండేవి. టీకి లక్షల్లో కాదు.. కోట్లల్లోనే ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తేం కాదు. అలాంటి టీ గురించి ఇంటర్నేషన్ టీ డే(international tea day) సందర్బంగా తెలియని, ఆసక్తికర విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • టీని మొదటిసారిగా క్రీస్తుపూరం 2737లో చైనా చక్రవర్తి షెన్ నంగ్ కనిపెట్టినట్టు చరిత్ర చెబుతోంది. ఒక రోజు ఆయన తాగే వేడి నీటి గిన్నెలో ఓ తేయాకు పడింది. దాన్నుంచి వచ్చిన టేస్ట్ ఆయనకు నచ్చడంతో... టీ పుట్టుకొచ్చింది.
  • ప్రస్తుతం ప్రపంచంలో ప్రధానంగా లభించే బ్లాక్, గ్రీన్, వైట్, ఊలాంగ్ టీలకు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇవన్నీ తయారయ్యేది ఒకటే మొక్కతో. ఆ మొక్క పేరు కామెల్లియా సినెన్సిస్. ఆకుల్ని ఏ సమయంలో కోశారు, ఎలా కోశారు, ఎలా ఎండబెట్టారు, ఎలా ప్రాసెస్ చేశారన్నదాన్ని ఆధారంగా చేసుకుని... రకరకాల టీలు పుట్టుకొచ్చాయి.
  • ఏప్రిల్ - మే మధ్యలో పెరిగిన తేయాకులతో తయారుచేసిన గ్రీన్ టీ.. ఇప్పుడు ప్రపంచంలోనే ది బెస్ట్ గ్రీన్ టీగా పేరు పొందింది.
  • ఇండియాలో టీని పాలు, తేనె, వెనీలా, అల్లం, లంవంగాలు, యాలకులు ఇలా రకరకాల పదార్థాలు, సుగంధ ద్రవ్యాలతో తయారుచేస్తున్నారు.
  • 1908లో టీ బ్యాగుల వాడకం అమెరికాలో తొలిసారిగా మొదలైంది. థామస్ సల్లివాన్... అప్పట్లో తన కంపెనీ టీ పొడిని టేస్ట్ చూడమని ప్రజలకు చిన్న బ్యాగుల్లో ఇచ్చాడు. ప్రజలు వాటిని వేడి నీటిలో ముంచి తాగారు. అలా టీ బ్యాగ్స్ పుట్టుకొచ్చాయి.
  • టీ బ్యాగ్స్ ఆరు నెలల వరకే ఫ్లేవర్ కలిగి ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా రుచి మారిపోతుంది లేదా తగ్గిపోతుంది.
  • 18వ శతాబ్దం నుంచీ రెండో ప్రపంచ యుద్ధం వరకూ అమెరికాలో గ్రీన్ టీ ఫేమస్ అయినప్పటికీ యుద్ధం తర్వాత మాత్రం ఇండియా నుంచీ టీని దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. అప్పుటి నుంచీ అమెరికాలో బ్లాక్ టీ పాపులర్ అయ్యింది.
  • ఐస్ టీ(Tea)ని 1904లో వర్జీనియాలో కనిపెట్టారు. ఐస్ ముక్కలపై టీని పోసి తాగడంతో ఐస్ టీ ఫేమస్ అయిపోయింది.
  • టీ ఆకుల్ని అధ్యయనం చెయ్యడాన్ని టస్సియోగ్రఫీ అంటారు.
  • ఫ్రూటీ, హెర్బల్ టీ కోసం... రాస్‌బెర్రీ మొక్కల ఆకుల్ని ఉడగబెట్టే అలవాటు చాలా మందికి ఉంది.
  • కొరియా, చైనాలో క్రిసాంతెమమ్ అనే హెర్బల్ టీని బాగా తాగుతారు. ఇది జ్వరం, తలనొప్పిని తగ్గిస్తుందని చాలా మంది నమ్ముతారు కూడా.
  •  తైవాన్‌లో 1980 నుంచీ బబుల్ టీ (బుడగల టీ) వాడకంలో ఉంది. చిక్కటి టీని బాగా గిలక్కొట్టి ఇస్తారు. అందువల్ల ఇందులో అన్నీ బుడగలే ఉంటాయి.
  •  ఇటలీలో ఆలివ్ చెట్ల ఆకుల నుంచీ కూడా టీని తయారు చేస్తారు. దాన్ని ఆలివ్ లీఫ్ టీ అంటారు.
  •  టిబెట్‌లో వెన్న టీ (బటర్ టీ) కామన్ డ్రింక్. దీన్ని బ్లాక్ టీ, యాక్ బటర్, ఉప్పు కలిపి తయారుచేస్తారు.
  • జెన్‌మైచా అనేది జపాన్‌లో ప్రత్యేకమైన టీ. దీన్ని గ్రీన్ టీ, వేపిన దంపుడు బియ్యంతో తయారుచేయడం మరో ప్రత్యేకత.