ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ ఎగ్జామ్స్..

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ ఎగ్జామ్స్..

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా మొదలయ్యాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్ష జరగనుంది. ఇవాళ్టి నుంచి  మార్చి 19 వరకూ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇంటర్‌ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 1,521 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని ఇంటర్ బోర్డ్ తెలిపింది.  407 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలను, ప్రభుత్వ ఆదీనంలో ఉండే 407 కాలేజీలను, 880 ప్రైవేటు కాలేజీలను పరీక్ష కేంద్రాలకు ఎంపిక చేశారు. 

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. 9 లక్షల 80 వేల 978 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 4లక్షల 78 వేల 718 మంది ఉండగా రెండవ  సంవత్సరం విద్యార్థులు 5 లక్షల 02 వేల 260 మంది ఉన్నారు. రెండో ఏడాది ప్రైవేటుగా పరీక్షలు రాసేవారు 58,071 మంది ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ తావులేకుండా  కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఇంటర్‌ బోర్డ్‌ తెలిపింది.