నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
  •  నేటి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 

హైదరాబాద్, వెలుగు: ఇవ్వాల్టి నుంచి రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 19 వరకూ పరీక్షలు కొనసాగుతా యి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,80,978 మంది పరీక్షలకు అటెండ్ కానున్నారు. వీరిలో ఫస్టియర్ స్టూడెంట్లు 4,78,718 మంది ఉండగా, సెకండియర్ స్టూడెంట్లు 5,02,260 మంది ఉన్నారు. వీరికోసం 1521 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే, ఈ సారి కూడా ఇంటర్ పరీక్షలకు నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు. 

దీంతో ఒక్క నిమిషం ఆలస్యమై నా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ నిరోధానికి సీసీకెమెరాలు ఏర్పాటు చేశామనీ, దీంతో పాటు 200 సిట్టింగ్ స్క్వాడ్స్, 75 ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్ లను రెడీ చేసినట్టు ఇంటర్ బోర్డు వెల్లడించిం ది. కాగా, ఇంటర్మీడియెట్ పరీక్షల నేపథ్యం లో పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సు సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ అధికారు లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.