ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట

ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట

ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోయి, కొట్టుకున్నారు. నేతలు జిక్కిడి ప్రభాకర్ రెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు వేయడంపై ఆయనకు మద్దతుగా హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కూడలిలో కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే మరో కాంగ్రెస్ నేత జిక్కిడి ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలు ఒక్కసారిగా మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దీక్షా శిబిరాన్ని ముట్టడించారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట, ఘర్షణలు చోటుచేసుకుంది.

గో బ్యాక్ మల్ రెడ్డి  రాంరెడ్డి అంటూ నినాదాలు..

స్థానికులకు కాకుండా, స్థానికేతరులకు ఇంఛార్జిగా వ్యవరించడం సరియైన పద్ధతి కాదంటూ  జిక్కిడి ప్రభాకర్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్య లేదని ఆరోపించారు. పెయిడ్ కార్యకర్తలను తీసుకొచ్చి దీక్షా శిబిరంలో కూర్చోబెట్టడం సిగ్గు చేటన్నారు. నిజమైన కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి పెయిడ్ కార్యకర్తలను తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలో ప్రజలు తిరస్కరిస్తే  ఎల్బీనగర్ లో పెత్తనం చేయడం సరియైన పద్ధతి కాదని మండిపడ్డారు.