అన్నవాహిక క్యాన్సర్పై అంతర్జాతీయ సదస్సు

అన్నవాహిక క్యాన్సర్పై అంతర్జాతీయ సదస్సు

మాదాపూర్, వెలుగు: బసవతారకం ఇండో -అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అన్నవాహిక క్యాన్సర్​పై శుక్రవారం మాదాపూర్​లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించగా, అమెరికా, జపాన్, కెనడా వంటి దేశాల నుంచి దాదాపు150 మంది నిపుణులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్ టీ సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ.. పొగాకు, మద్యం, అధిక బరువు, పోషకాహార లోపం వల్ల ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని, తెలుగు రాష్ట్రాల్లో దీని కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. రోబోటిక్ సర్జరీ, ఇమ్యూనోథెరపీ వంటి అత్యాధునిక సాంకేతికతలతో ఈ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చన్నారు.