హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. విద్యార్థుల్లో ఆరోగ్యం, ఏకాగ్రత, మానసిక ప్రశాంతత పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ఈ మేరకు డీఈఓలకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఏడాది ‘యోగా సంగమం’ పేరుతో దేశవ్యాప్తంగా సామూహిక యోగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీచర్లు, స్టూడెంట్స్, స్కూల్ సిబ్బంది పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ రూపొందించిన కామన్ యోగా ప్రోటోకాల్ ప్రకారం యోగా ప్రోగ్రామ్స్నిర్వహించాలన్నారు. కార్యక్రమాల పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో నోడల్ ఆఫీసర్లను నియమించాలని చెప్పారు.
