AI జాబ్స్లో మహిళలే బిగ్ విన్నర్స్.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ల కంటే ఎక్కువ జీతాలు వీళ్లకే !

AI జాబ్స్లో మహిళలే బిగ్ విన్నర్స్.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ల కంటే ఎక్కువ జీతాలు వీళ్లకే !

ఉద్యోగ రంగంలో ఆర్టిఫిషియల్ ఎంటెలిజెన్స్ (AI) సమూల మార్పులు తెస్తున్నాయి. జీతాల్లో ఇన్నాళ్లు సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ టాప్ అనుకుంటే.. అంతకు మించిన శాలరీలతో ఆకర్శిస్తోంది. ప్రస్తుత టెక్ ఇండస్ట్రీ ఉద్యోగులు ఏఐ వైపు షిఫ్ట్ అయ్యేందుకు మార్గాలను ఎంచుకుంటున్నారు. కొత్త జనరేషన్ కు ఏఐ కెరీర్ ఊహించని రీతిలో బూస్టింగ్ ఇస్తోంది. అయితే ఈ ట్రాన్స్ ఫార్మేషన్ లో పురుషుల కంటే మహిళలే టాప్ గేర్ లో ఉన్నట్లు నివేదికలు వెళ్లడిస్తున్నాయి. ఏఐ జాబ్స్ లో మహిళలే బిగ్ విన్నర్స్ అని స్కేలర్ అనే లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 

స్కేలర్ అనే లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ రిపోర్ట్ ఇండియా AI వర్క్‌ఫోర్స్ రిపోర్ట్ 2026 ప్రకారం.. AI ని కెరీర్ గా ఎంచుకునే మహిళలు, ఏఐ కి షిఫ్ట్ అవుతున్న విమెన్.. శాలరీ హైక్స్ లో యావరేజ్ గా 145 శాతం పొందుతున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు ఉన్న టెక్ ఉద్యోగాలతో పోల్చితే ఏఐ అవకాశాలు ఎలా మార్చుతోందో ఈ రిపోర్ట్ ద్వారా అర్థమవుతోంది. 

ఇండియా వ్యాప్తంగా 11,444 మందిని చేసిన సర్వేలో.. ఏఐ (AI) అనేది కేవలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు మాత్రమే పరిమితమైన స్పెషల్ స్కిల్ కాకుండా, టోటల్ వర్క్ ఫోర్స్ కు సంబంధించినదిగా అభిప్రాయపడుతున్నారు.  ఈ ఫీల్డ్ లో మహిళలు ఇంజనీరింగ్ రంగానికి మించి ఏఐ అవకాశాలు పొందుతున్నట్లు చెబుతున్నారు. హెచ్‌ఆర్, విద్యా రంగం, మార్కెటింగ్ సహా ఇతర వ్యాపార విభాగాలలో దూసుకుపోతున్నట్లు వెల్లడించింది. మహిళా ఎక్స్ పర్ట్స్, ఏఐ స్కిల్స్ పెంచుకున్న తర్వాత క్యూఏ (QA) ఇంజనీర్ల జీతాలు చాలా వేగంగా పెరుగుతున్నట్లు పేర్కొంది. ఈ రంగంలో మహిళల జీతభత్యాలు ఏకంగా 574 శాతం వరకు పెరిగినట్లు సర్వేలో తేలింది. 

అన్ని ఇండస్ట్రీలలో  ఏఐ వినియోగం పెరుగుతున్నందు.. ఇండియా వర్క్ ఫోర్స్ పెద్ద ఎత్తున మార్పు చెందుతున్నట్లు రిపోర్ట్ వెల్లడించింది. ప్రస్తుతం ఏఐ నేర్చుకునేవారిలో దాదాపు 25 శాతం మంది టెక్నాలజీ బ్యాగ్రౌండ్ లేని వారే నని తెలిపింది.  ఇది ఇంజనీరింగ్, టెక్నాలజీయేతర రంగాల నుంచి  ఏఐ పట్ల పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనం.  అంతేకాకుండా, ఏఐ బేస్డ్ జాబ్స్ లో కేవలం 50 శాతం మాత్రమే ఇంజనీరింగ్ బ్యాగ్రౌండ్ నుంచి ఉన్నట్లు వెల్లడించింది. వీటికి అతీతంగా లీడర్షిప్, కన్సల్టింగ్, హెచ్‌ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, విద్యా రంగం, ఇతర డ్యూటీలకు ఎక్స్ పాండ్ అవుతున్నట్లు నివేదిక పేర్కొంది.

AI కొత్త అవకాశాలను, కొత్త మార్గాలను సృష్టిస్తోంది, కెరీర్ డెవలప్మెంట్ ను వేగవంతం చేస్తోంది. ఈ రంగంలో ఎక్స్ పర్ట్స్ హై శాలరీ పొందేలా చేస్తోంది. AI గురించి మాట్లాడుతున్న ప్రతీసారి ఉద్యోగాలు పోతాయనే చర్చలే నడుస్తున్న  తరుణంలో, ఈ రిపోర్ట్ అందుకు భిన్నంగా వాదిస్తోంది.. అని స్కేలర్ కో ఫౌండర్ అభిమన్యు సక్సేనా అన్నారు.

ఇండియాలో AI ట్యాలెంట్ ప్రపంచంతో పోటీ పడుతోందని నివేదిక పేర్కొంది.  ముఖ్యంగా AI లెర్నింగ్, కెరీర్ అపార్చునిటీస్ కోసం యువత ముందుకు వస్తున్నట్లు తెలిపింది. ఇప్పుడు AI నేర్చుకునేవారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు లక్నో , పాట్నా, కోయంబత్తూర్, జైపూర్, ఇండోర్, నాగ్‌పూర్ వంటి టైర్-II సిటీల నుంచి వస్తున్నట్లు రిపోర్టు పేర్కొంది.