సెక్రటేరియట్ లో లీకేజీలు.. నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు

సెక్రటేరియట్ లో లీకేజీలు.. నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు

హైదరాబాద్ సెక్రటేరియట్లో మరోసారి డొల్లతనం బహిర్గతమైంది. దాదాపు రూ.1200 కోట్లతో నిర్మించిన సచివాలయ బిల్డింగ్  పెచ్చులు ఊడడం, స్లాబ్ నుంచి లీకేజ్ కావడం వంటి ఘటనలు తరచూ  జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో సెక్రటేరియట్ బిల్డింగ్ నుంచి పెచ్చులూడిన సంగతి తెలిసిందే.

 లేటెస్ట్ గా అక్టోబర్ 7న  నాల్గవ అంతస్తులో మంత్రి కొండా సురేఖ పేషీలోకి వర్షంపు నీరు చేరింది.  పైపుల్లో వర్షం నీళ్లు నిలవడంతో ఇంటర్నెట్ కు అంతరాయం ఏర్పడింది.  విద్యుత్ వైర్లు,ప్రింటర్లు, కంప్యూటర్లు వర్షం నీటిలోనే ఉన్నాయి. దీంతో సెక్రటేరియట్లోని పలు శాఖల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.  ఇంటర్నెట్ ఆగిపోవడంతో ఫైళ్లు అప్లోడ్ కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఇంటర్నెట్ పునరుద్దరణకు సిబ్బంది చర్యలు చేపట్టింది.

2025 ఫిబ్రవరి 12న కూడా సెక్రటేరియట్ లో పెచ్చులూడి పడ్డాయి. ఆరో ఫ్లోర్​ (సీఎం చాంబర్​ఉండే అంతస్తు ) పైనుంచి పీఓపీ పెచ్చులు కూలి రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ వెహికల్ పై పడ్డాయి. దాంతో వాహనం పైభాగం దెబ్బతింది. అక్కడ ఎవరూ లేకపోవడడంతో ప్రమాదం తప్పింది.