
తూనీగ తూనీగ, కేరింత, కొలంబస్, హ్యాపీ వెడ్డింగ్, ప్రేమకథా చిత్రం2 చిత్రాలతో మెప్పించిన సుమంత్ అశ్విన్.. ఈ నెల 24న ‘7 డేస్ 6 నైట్స్’ సినిమాతో రాబోతున్నాడు. తన తండ్రి ఎమ్మెస్ రాజు డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తనే నిర్మించాడు కూడా. ఆ ఎక్స్‌పీరియెన్స్ గురించి, సినిమా గురించి ఇలా ముచ్చటించాడు. ‘‘కొన్ని సక్సెస్‌లు, కొన్ని ఫెయిల్యూర్స్‌తో నా పదేళ్ల కెరీర్ సాఫీగానే సాగింది. ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోల్చితే దీనిలో డిఫరెంట్ క్యారెక్టర్ చేశా. రియాల్టీకి దగ్గరగా ఉండే పాత్ర. నా జర్నీలో వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్‌గా చెప్పుకుంటాను. ఓటీటీల రాకతో ప్రేక్షకులు కూడా డిఫరెంట్ కంటెంట్, డిఫరెంట్ రోల్స్‌ని ఇష్టపడుతున్నారు. ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకునే యంగ్‌స్టర్‌గా కనిపిస్తాను. తనకి చాలా సమస్యలుంటాయి. స్ట్రగులవుతూ ఉంటాడు. దీంతో ఎక్కువ స్మోక్ చేస్తాడు. వెయిట్ కూడా బాగా పెరిగిపోతుంటాడు. అస్సలు కేర్ తీసుకోడు. ఆ లుక్‌లో కొత్తగా కనిపిస్తాను. నాతో పాటు రోహన్‌ది కూడా ఇంపార్టెంట్ రోల్. నాకు పెయిర్‌గా మెహర్ చాహల్ నటించింది. పర్ఫెక్ట్ యాక్టర్స్‌తో చేసిన సినిమా ఇది. ఈ రోజు ఫాదర్స్ డే. అసలైతే నేనే మా నాన్నకు గిఫ్ట్ ఇవ్వాలి. కానీ ఈ సినిమా ఫస్ట్ కాపీ చూపించి ఆయనే నాకు గిఫ్ట్ ఇచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది. విడుదలైన రెండు వారాల తర్వాత కూడా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటారు. మరో జన్మంటూ ఉంటే మళ్లీ ఎం.ఎస్.రాజు గారి అబ్బాయిగానే పుట్టాలని కోరుకుంటా.’’