విరాట్ విశ్వకర్మ మహోత్సవానికి రండి: సీఎంకు ఆహ్వాన పత్రిక

విరాట్ విశ్వకర్మ మహోత్సవానికి రండి: సీఎంకు ఆహ్వాన పత్రిక

ముషీరాబాద్, వెలుగు: ఈ నెల 28న ఉప్పల్ భగాయత్‎లో నిర్వహించే విరాట్ విశ్వకర్మ మహోత్సవానికి హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డికి బీసీ కుల సంఘాల జేఏసీ, ఆత్మగౌరవ కమిటీ చైర్మన్ కుందార గణేశ్​చారి ఆహ్వానపత్రిక అందజేశారు. సోమవారం ఆత్మగౌరవ కమిటీ ప్రతినిధులతో కలిసి సీఎం నివాసానికి వెళ్లారు. కార్యక్రమంలో లాల్ కోట వెంకటాచార్యులు, వేములవాడ మదన్మోహన్, సుంకోజు కృష్ణమాచారి, సుంకోజు రమేశ్​చారి తదితరులు ఉన్నారు.