
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కో–ఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్(ఎన్ఐపీసీసీడీ) పేరును సావిత్రి భాయి ఫులె జాతీయ మహిళా, శిశు అభివృద్ధి సంస్థగా మార్చినట్లు మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రకటించింది. ఈ మార్పు జూన్ 19 నుంచే అమల్లోకి వచ్చినట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ జూన్ 30న తెలిపింది. సంఘ సంస్కర్త, విద్యావేత్త, మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయి ఫూలె సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కో–ఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్(ఎన్ఐపీసీసీడీ) అనేది భారత ప్రభుత్వ మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ కింద పనిచేస్తున్న ఒక ప్రతిష్టాత్మక స్వయం ప్రతిపత్తి సంస్థ. ఇదిమహిళా, శిశు అభివృద్ధి, ప్రజా సహకార రంగాల్లో రక్షణ, పరిశోధన, మూల్యాంకనం, డాక్యుమెంటేషన్‌కు అంకితమైన ఒక అపెక్స్(అత్యున్నత) సంస్థ. దేశంలో మహిళలు, పిల్లల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన విధానాలు, కార్యక్రమాల సమర్థవంతమైన అమలులో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది.