మైండ్‌‌‌సెట్‌‌ చాలా ముఖ్యం: విరాట్ కోహ్లీ

మైండ్‌‌‌సెట్‌‌ చాలా ముఖ్యం: విరాట్ కోహ్లీ

న్యూఢిల్లీ: ఐపీఎల్ పదమూడో సీజన్‌‌‌ ప్రారంభం కావడంపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఉత్సుకతగా ఉంది. ఈ నెల 21న సన్‌‌రైజర్స్‌‌తో జరిగే మ్యాచ్‌‌తో బెంగళూరు టీమ్ టోర్నీని ఆరంభించనుంది. కోహ్లీ నాయకత్వంలోని ఈ జట్టు ప్రస్తుతం ప్రాక్టీస్ సెషన్స్‌‌‌పై దృష్టి సారించింది. తమ ప్లేయర్ల సన్నాహకాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఆర్సీబీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. తాజాగా ప్రాక్టీస్ సెషన్‌‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ హిట్టింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో విరాట్ తన బ్యాటింగ్ గురించి పలు విషయాలు పంచుకున్నాడు. ఐదు నెలల గ్యాప్ తర్వాత బ్యాట్ పట్టినప్పుడు భయపడ్డానని చెప్పాడు. మొదటి కొన్ని రోజులు కష్టంగా సాగిందన్నాడు. ఐదు నెలల గ్యాప్ తర్వాత మునుపటి మైండ్ సెట్‌‌లోకి మారడానికి టైమ్ పట్టిందని పేర్కొన్నాడు.

‘రీసెంట్ సెషన్స్‌‌తో బ్యాటింగ్ మెరుగైంది. బాల్‌‌ను సరిగ్గా మిడిల్ చేయగలుగుతున్నాం. బాల్‌‌ను ఫీల్డ్ ప్లేస్‌‌మెంట్స్‌‌కు తగ్గట్లు హిట్ చేయడంతోపాటు వికెట్‌‌పై పేస్‌‌ను అర్థం చేసుకుంటున్నాం. టీమ్ సన్నద్ధమవుతున్న తీరుపై సంతోషంగా ఉన్నా. కొన్ని భుజాలు (ప్లేయర్లు) మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాయి. కొన్ని నెలలుగా ఆడకపోవడంతో అవి నిద్రావస్థలోకి జారుకున్నాయి. అయితే ఇప్పుడు ప్లేయర్లు మళ్లీ గేమ్ మూడ్‌‌లోకి వచ్చేశారని భావిస్తున్నా. ఎవ్వరికీ గాయాలవ్వొద్దనే కో్రుకుంటున్నాం. టీమ్ సమతూకంగా కనిపిస్తోంది. వచ్చే కొన్ని ట్రెయినింగ్ సెషన్స్‌‌లో ప్రాక్టీస్‌‌కు మంచి టైమ్‌‌ను కేటాయిస్తాం. ఫిట్‌‌నెస్ విషయంలో అందరూ చాలా మెరుగ్గా కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ గుడ్ షేప్‌‌లో ఉన్నారు. నేనైతే తొలి సెషన్ నుంచే ఫిట్‌‌గా ఫీలవుతున్నా. ఇదంతా మైండ్ సెట్‌‌ను బట్టి ఉంటుంది. ఒక్కసారి ఆ మైండ్ సెట్‌‌కు చేరుకుంటే కాంపిటీషన్ ఆరంభమైనట్లే. సాధ్యమైనంతగా అదే ఆలోచనా విధానంతో ఉండాలి’ అని కోహ్లీ వివరించాడు.