ఇవాళ రాజస్థాన్ రాయల్స్ తో కోల్ కతా ఢీ

ఇవాళ రాజస్థాన్ రాయల్స్ తో కోల్ కతా ఢీ

కోల్‌కతాకు కఠిన పరీక్ష

దుబాయ్‌‌‌‌‌‌‌‌: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌–13లో మరో రసవత్తర మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు రంగం సిద్ధమైంది. పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ లైనప్‌‌‌‌‌‌‌‌ ఉన్న కోల్‌‌‌‌‌‌‌‌కతా నైట్‌‌‌‌‌‌‌‌రైడర్స్‌‌‌‌‌‌‌‌.. నేడు జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సంచలనాల రాజస్తాన్‌‌‌‌‌‌‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో నెగ్గిన రాయల్స్‌‌‌‌‌‌‌‌.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా, కోల్‌‌‌‌‌‌‌‌కతా ఓ విజయం, ఓ ఓటమితో ఏడో స్థానంలో కొనసాగుతున్నది. అండర్‌‌‌‌‌‌‌‌డాగ్స్‌‌‌‌‌‌‌‌గా లీగ్‌‌‌‌‌‌‌‌ను మొదలుపెట్టిన రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ గత రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో అద్భుతాలు చేసింది. సునామీ ఆటతీరుతో చెలరేగుతూ నమ్మశక్యంగాని స్థాయిలో రికార్డు విజయాలను సొంతం చేసుకుంది. రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లోనూ 200 రన్స్‌‌‌‌‌‌‌‌ను ఛేజ్‌‌‌‌‌‌‌‌ చేయడంతో టీమ్‌‌‌‌‌‌‌‌ మొత్తం ఫుల్‌‌‌‌‌‌‌‌ కాన్ఫిడెన్స్‌‌‌‌‌‌‌‌తో ఉంది.

సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌, రాహుల్‌‌‌‌‌‌‌‌ తెవాటియా రూపంలో ఇద్దరు స్టార్లు దొరకడంతో రాజస్తాన్‌‌‌‌‌‌‌‌  బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ మరింత పటిష్టంగా తయారైంది. పంజాబ్‌‌‌‌‌‌‌‌పై తెవాటియా ఆడిన ఆటను అంత తొందరగా మర్చిపోలేరు. దీంతో ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనూ అతనిపై భారీ ఆశలు ఉన్నాయి. ఇక శాంసన్‌‌‌‌‌‌‌‌ 214.86 స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌తో చెలరేగుతుండటం ప్రత్యర్థి బౌలర్లకు మింగుడుపడని అంశం. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ స్మిత్‌‌‌‌‌‌‌‌ ఫర్వాలేదనిపిస్తున్నా.. బట్లర్‌‌‌‌‌‌‌‌ గాడిలో పడాలి. మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌లో రియాన్‌‌‌‌‌‌‌‌ పరాగ్‌‌‌‌‌‌‌‌, ఊతప్ప మెరిస్తే భారీ స్కోరు ఖాయం.  బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఆర్చర్‌‌‌‌‌‌‌‌, కరన్‌‌‌‌‌‌‌‌, శ్రేయస్‌‌‌‌‌‌‌‌ గోపాల్‌‌‌‌‌‌‌‌ అంచనాలను అందుకోవడం శుభపరిణామం. మరోవైపు కేకేఆర్‌‌‌‌‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గెలవడం అత్యంత కీలకంగా మారింది. ఇయాన్‌‌‌‌‌‌‌‌ మోర్గాన్‌‌‌‌‌‌‌‌, ఆండ్రీ రసెల్‌‌‌‌‌‌‌‌కు ఇప్పటివరకు తక్కువ అవకాశాలే వచ్చాయి. కాబట్టి ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో రసెల్‌‌‌‌‌‌‌‌.. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ లైనప్‌‌‌‌‌‌‌‌లో పైకి వచ్చే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ దినేశ్‌‌‌‌‌‌‌‌, నితీశ్​ రాణా గాడిలో పడాల్సి ఉంది. ఓపెనర్లలో గిల్‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ సూపర్బ్‌‌‌‌‌‌‌‌గా ఉన్నా ఫించ్‌‌‌‌‌‌‌‌ హిట్టర్‌‌‌‌‌‌‌‌ నరైన్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లో లేకపోవడం లోటు.  బౌలర్లలో కుల్దీప్‌‌‌‌‌‌‌‌, మావి, కమిన్స్‌‌‌‌‌‌‌‌,  నాగర్‌‌‌‌‌‌‌‌కోటి మరోసారి మెరవాల్సి ఉంది. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో అన్ని వైపుల నుంచి కోల్‌‌‌‌‌‌‌‌కతాకు కఠిన పరీక్ష ఎదురుకానుంది.