ముంబైతో ఎవరు?.. ఇవాళ ఢిల్లీతో హైదరాబాద్ సన్ రైజర్స్ ఢీ

ముంబైతో ఎవరు?.. ఇవాళ ఢిల్లీతో హైదరాబాద్ సన్ రైజర్స్ ఢీ

 

ఐపీఎల్‌‌‌‌‌‌‌ –13 జర్నీని పడుతూలేస్తూ  స్టార్ట్‌‌ చేసినా.. సరైన టైమ్‌‌లో పుంజుకున్న సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ టైటిల్‌‌ వేటలో మరో  సవాల్‌‌కు రెడీ అయ్యింది.  టాప్‌‌ గేర్‌‌లో టోర్నీని స్టార్ట్‌‌ చేసి చివర్లో తడబడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో  నేడు జరిగే క్వాలిఫయర్‌‌–2లో అమీతుమీ తేల్చుకోనుంది.  ఇటు డేవిడ్‌‌ వార్నర్‌‌.. అటు శ్రేయస్‌‌ అయ్యర్‌‌..  మెగా ఫైనల్‌‌ చేరడమే ఇద్దరి టార్గెట్‌‌. రెండోసారి చాంపియన్‌‌ అవ్వాలన్న సన్‌‌రైజర్స్‌‌ కల సజీవంగా ఉండాలన్నా.. తొలిసారి టైటిల్‌‌ సాధించాలనే  క్యాపిటల్స్‌‌ ఆశ నెరవేరాలన్నా.. ఈ పోరులో గెలవడం ఒక్కటే దారి! మరి.. జోరు మీదున్న ఆరెంజ్‌‌ ఆర్మీ దూకుడు కొనసాగిస్తుందా.. బ్యాటింగ్‌‌ వైఫల్యంతో తప్పటడుగులేస్తున్న ఢిల్లీ ముందడుగు వేస్తుందా..?  మెగా ఫైనల్‌‌కు చేరేదెవరు.. ముంబైని ఢీ కొట్టేదెవరు?

అబుదాబి : ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనలే లక్ష్యంగా సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌, ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌ కీలకపోరుకు సిద్ధమయ్యాయి. ఆదివారం ఇక్కడ జరిగే క్వాలిఫయర్‌‌‌‌–2 మ్యాచ్‌‌‌‌లో  అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ పోరులో గెలిచిన జట్టు మంగళవారం జరిగే మెగా ఫైనల్‌‌‌‌కు అర్హత సాధిస్తుంది. 2016లో ఐపీఎల్‌‌‌‌ చాంపియన్‌‌‌‌గా నిలిచిన  సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ .. హిస్టరీ  రిపీట్‌‌‌‌ చేయాలని చూస్తుండగా.. తొలిసారి ఫైనల్‌‌‌‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించాలని ఢిల్లీ భావిస్తోంది. బౌలింగ్‌‌‌‌లో రెండు టీమ్‌‌‌‌లు సమంగా ఉండగా.. బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌ రాణించిన టీమే ఈ మ్యాచ్‌‌‌‌లో హిట్టయ్యే చాన్సు ఎక్కువగా ఉంది. ఓవరాల్‌‌‌‌గా వరుస విజయాలతో ఊపుమీదున్న సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ ఫేవరెట్‌‌‌‌గా బరిలోకి దిగుతోంది. లీగ్​ స్టేజ్​లో ఢిల్లీతో ఆడిన రెండు మ్యాచ్​ల్లోనూ నెగ్గిన రైజర్స్​ మూడోసారి ఆ జట్టును ఓడించి ఫైనల్​ చేరాలని ఆశిస్తోంది. అబుదాబిలో గత ఆరు మ్యాచ్‌‌‌‌ల్లోనూ ఛేజింగ్‌‌‌‌ చేసిన జట్లే నెగ్గడంతో ఈ పోరులో టాస్‌‌‌‌ కీలకం కానుంది.

సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ జోష్‌‌‌‌ కొనసాగేనా..

ఐపీఎల్ ఫస్టాఫ్​లో  పెద్దగా ఆకట్టుకోని సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌.. లీగ్‌‌‌‌ చివరి దశకు దగ్గరవుతున్న కొద్దీ దూకుడు పెంచింది. కీలక టైమ్‌‌‌‌లో సరైన విజయాలు ఖాతాలో వేసుకుంది. హ్యాట్రిక్‌‌‌‌ విక్టరీలతో క్వాలిఫయర్‌‌‌‌–2 దాకా వచ్చింది. ఎలిమినేటర్‌‌‌‌లో బెంగళూరుకు షాకిచ్చి సూపర్‌‌‌‌ జోష్‌‌‌‌లో ఉంది. అదే దూకుడు కొనసాగిస్తే ఈ మ్యాచ్‌‌‌‌లోనూ ఢిల్లీకి ఝలక్‌‌‌‌ తప్పదు.  గాయాల వల్ల భువనేశ్వర్‌‌‌‌ వంటి సీనియర్లు దూరమైనా.. కుర్రాళ్లతో టీమ్‌‌‌‌ను ఈ స్టేజ్‌‌‌‌కు తీసుకొచ్చిన వార్నర్‌‌‌‌ అద్భుతం చేస్తున్నాడనే చెప్పాలి. అది కొనసాగాలంటే  మరోసారి టీమ్‌‌‌‌ మొత్తం సత్తా చాటి తీరాలి. సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌కు బ్యాటింగ్‌‌‌‌లో పెద్దగా సమస్యల్లేవు. ఇంజ్యురీతో వృద్ధిమాన్‌‌‌‌ సాహా దూరమవ్వడం కాస్త  ఇబ్బంది కలిగిస్తోంది.  సాహా ప్లేస్‌‌‌‌లో బెంగళూరుపై బరిలోకి దిగిన శ్రీవత్స్‌‌‌‌ గోస్వామి ఫ్లాప్‌‌‌‌ అయ్యాడు. ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌లో నలుగురు ఫారినర్లు ఉండాలనే రూల్‌‌‌‌తో బెయిర్‌‌‌‌ స్టో మరోసారి బెంచ్​కు పరిమితమవ్వక తప్పేలా లేదు. దీంతో  గోస్వామికే  చాన్స్‌‌‌‌ దక్కేలా ఉంది..

అయితే, ఈ  వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ను  ఏ ప్లేస్‌‌‌‌లో ఆడిస్తారో చూడాలి. ముఖ్యంగా కెప్టెన్‌‌‌‌ వార్నర్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌లో హిట్‌‌‌‌ అయితే హైదరాబాద్‌‌‌‌ భారీ స్కోరు చేయడం ఖాయం. మనీశ్‌‌‌‌ పాండే, కేన్‌‌‌‌ విలియమ్సన్‌‌‌‌ మంచి ఫామ్‌‌‌‌లో ఉండడం కలిసొచ్చే అంశం. ఇక, కెరీర్‌‌‌‌ ప్రారంభంలోనే  పెద్ద మ్యాచ్‌‌‌‌లాడే చాన్స్‌‌‌‌ దక్కించుకున్న ప్రియమ్‌‌‌‌ గార్గ్‌‌‌‌, అబ్దుల్‌‌‌‌ సమద్‌‌‌‌ మరింత బాధ్యతగా ఆడాలి. లేదంటే మిడిలార్డర్‌‌‌‌లో డొల్లతనం ప్రత్యర్థికి అడ్వాంటేజ్‌‌‌‌ కాగలదు. ఇక, లీగ్‌‌‌‌ చివరి దశలో జట్టులోకి వచ్చిన ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ జేసన్‌‌‌‌ హోల్డర్‌‌‌‌ ఇప్పుడు ప్రధాన ఆయుధంగా మారాడు. ఇటు బౌలింగ్‌‌‌‌, అటు బ్యాటింగ్‌‌‌‌లో చెలరేగుతూ విజయాలు అందిస్తున్నాడు. స్పిన్నర్లు రషీద్‌‌‌‌ ఖాన్‌‌‌‌, షాబాజ్‌‌‌‌ నదీమ్‌‌‌‌ అవసరమైన టైమ్‌‌‌‌లో వికెట్లు తీస్తూ జట్టును రేసులో ఉంచుతున్నారు. పేసర్‌‌‌‌ సందీప్‌‌‌‌ శర్మ అదిరిపోయే పెర్ఫామెన్స్‌‌‌‌ చేస్తుండగా.. నటరాజన్‌‌‌‌ తన మార్కు యార్కర్లతో చెలరేగుతున్నాడు. వీరంతా ఫామ్‌‌‌‌ కొనసాగిస్తే సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ ముందడుగు వేయడం ఖాయం.

ఒత్తిడిలో క్యాపిటల్స్​…

గత ఆరు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఐదింటిలో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌పై ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ ప్రెజర్‌‌‌‌‌‌‌‌ ఉండనుంది. తొలిసారి ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఆడే చాన్స్‌‌‌‌‌‌‌‌ కళ్ల ముందు ఉండగా.. వరుస పరాజయాలు వారి ఆత్మవిశ్వాసాన్ని కాస్త దెబ్బతీశాయి. ముఖ్యంగా టాపార్డర్‌‌‌‌‌‌‌‌ ఫెయిల్యూర్‌‌‌‌‌‌‌‌ భారీ నష్టం కలిగిస్తోంది. శిఖర్‌‌‌‌‌‌‌‌ ధవన్‌‌‌‌‌‌‌‌, అజింక్య రహానె, పృథ్వీ షాలో ఏ ఇద్దరిని ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌కు పంపినా వారికి వర్కౌటవ్వడం లేదు. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌లో ముగ్గురూ డకౌటవడం జట్టును దెబ్బతీసింది. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఈ త్రయంలో ధవన్‌‌‌‌‌‌‌‌(15 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో 525 రన్స్) కాస్త ఫర్వాలేదనిపిస్తుండగా.. పృథ్వీ(13 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో 228 రన్స్‌‌‌‌‌‌‌‌), రహానె (7 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో 111 రన్స్) ఫ్లాప్‌‌‌‌‌‌‌‌ షో కొనసాగిస్తున్నారు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో ధవన్‌‌‌‌‌‌‌‌ నాలుగు సార్లు, పృథ్వీ మూడు సార్లు, రహానె రెండు సార్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేరారు.

వీళ్ల ఫెయిల్యూర్​ వల్ల  మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌ ఒత్తిడిలోకి వెళుతోంది. దీంతో జట్టు భారీ స్కోర్లు చేయలేకపోతోంది. టాపార్డర్‌‌‌‌‌‌‌‌ గాడిలో పడకుంటే ఢిల్లీ టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌ చేరడం కష్టం. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌, మార్కస్‌‌‌‌‌‌‌‌ స్టోయినిస్‌‌‌‌‌‌‌‌ మంచి టచ్‌‌‌‌‌‌‌‌లో ఉండగా.. వికెట్‌‌‌‌‌‌‌‌కీపర్‌‌‌‌‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌ నుంచి టీమ్‌‌‌‌‌‌‌‌ మరింత ఆశిస్తోంది. స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌కు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లోనూ మెరుస్తున్నాడు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో మాత్రం క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌ చాలా బలంగా ఉంది. పేసర్లు రబాడ(25 వికెట్లు), అన్రిచ్‌‌‌‌‌‌‌‌ నోకియా(20) సీజన్‌‌‌‌‌‌‌‌ ప్రారంభం నుంచి అదరగొడుతున్నారు. సీనియర్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌‌‌‌‌‌‌(13 వికెట్లు) స్థాయికి తగ్గ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాడు. ముంబైతో జరిగిన క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌–1లో మూడో పేసర్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగిన డానియల్‌‌‌‌‌‌‌‌ సామ్స్‌‌‌‌‌‌‌‌ భారీగా పరుగులు ఇవ్వడంతో ఈసారి చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉండకపోవచ్చు. అతన్ని తప్పిస్తే హెట్‌‌‌‌‌‌‌‌మయర్‌‌‌‌‌‌‌‌ జట్టులోకి వస్తాడు. అప్పుడు రబాడ, నోకియా, అశ్విన్‌‌‌‌‌‌‌‌, అక్షర్‌‌‌‌‌‌‌‌తో కలిసి స్టోయినిస్‌‌‌‌‌‌‌‌ పూర్తి కోటా ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా టాపార్డర్‌‌‌‌‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌ సక్సెస్‌‌‌‌‌‌‌‌పైనే ఢిల్లీ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.