న్యూఢిల్లీ: దేశంలో కరోనా తగ్గిపోవడంతో.. ఐపీఎల్ వేదికలను పెంచాలని బీసీసీఐ యోచిస్తున్నది. ఇందులో భాగంగా ఈ సీజన్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌తో పాటు మరో సిటీలో నిర్వహించాలని భావిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే క్వాలిఫయర్–2 (మే 27)తో పాటు, మెగా ఫైనల్ (మే 29)కు అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. క్వాలిఫయర్–1 (మే 24), ఎలిమినేటర్ (మే 25) మ్యాచ్‌లను లక్నో లేదా కోల్‌కతాలో ఆడించాలని బోర్డు భావిస్తోంది. మే 23 నుంచి 24 వరకు విమెన్స్ టీ20 చాలెంజర్ టోర్నీ జరగనుంది. ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల షెడ్యూల్, ఆతిథ్య స్టేడియాలపై వచ్చే వారం తుది నిర్ణయం తీసుకుంటామని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. ‘ఎక్కువ వేదికల అంశంపై చర్చలు జరుగుతున్నాయి. కొవిడ్ పరిస్థితి కంట్రోల్‌లో ఉంది. బబుల్‌కు ముందుగానీ, తర్వాత గానీ ఎక్కడా కొవిడ్ కేసులు నమోదు కాలేదు’ అని సదరు అధికారి వెల్లడించారు.

