IPL 2025 Final: ఈ సారి ఎంటర్‌టైన్ మెంట్ లేదు ఓన్లీ ఎమోషన్.. ముగింపు వేడుకలు ఎలా జరగబోతున్నాయంటే..?

IPL 2025 Final: ఈ సారి ఎంటర్‌టైన్ మెంట్ లేదు ఓన్లీ ఎమోషన్.. ముగింపు వేడుకలు ఎలా జరగబోతున్నాయంటే..?

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2025 ముగింపు వేడుకలను ప్రత్యేక ఆకర్షణగా నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. మంగళవారం (జూన్ 3) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య సాయంత్రం 7:30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా ‘ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిందూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ను విజయవంతం చేసిన మన సాయుధ దళాలను ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందర్భంగా సత్కరించనున్నట్టు కొన్ని రోజుల క్రితమే బీసీసీఐ తెలిపింది. ప్రతి సీజన్ కు మాదిరి ఈ సారి గ్రాండ్ గా ఐపీఎల్ ముగింపు వేడుకలను నిర్వహించకుండా ఈ సారి ఎమోషనల్ గా గుడ్ బై చెప్పనున్నట్టు తెలుస్తుంది. 

ఫైనల్ కు ముందు ఇండియన్ ప్రఖ్యాత సింగర్ శంకర్ మహదేవన్ తన గానంతో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కు ప్రత్యేక నివాళి ఇవ్వనున్నారు. “ఎ ట్రిబ్యూట్ టు ది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్” స్పెషల్ పెర్ఫెర్మాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దేశభక్తి పాటలతో ఎమోషనల్ టచ్ ఇవ్వనున్నాడు. ఐపీఎల్ తమ ఎక్స్ ద్వారా ఇలా రాసుకొచ్చింది. "ఒక గ్రాండ్ ఫైనల్. ఒక గొప్ప సెల్యూట్. టాటా ఐపీఎల్ 2025 చివరి అధ్యాయం ముగుస్తున్న తరుణంలో, మన దేశ నిజమైన హీరోలైన భారత సాయుధ దళాలను ప్రశంసించడానికి కొంత సమయం తీసుకుంటాము" అని పోస్ట్ చేసింది.

ఐపీఎల్ ఫైనల్‌కు భారత సాయుధ దళాల ముగ్గురు సర్వీసుల అధిపతులను ఆహ్వానించినట్లు బీసీసీఐ తెలిపింది. జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా, అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి నావల్ చీఫ్‌గా ఉన్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఎయిర్ స్టాఫ్ చీఫ్‌గా ఉన్నారు.ఇటీవలే ఆపరేషన్ సిందూర్ సమయంలో వారి "వీరోచిత ప్రయత్నాలకు" నివాళిగా ఈ కార్యక్రమం ముగింపు వేడుక కూడా ఉండబోతుంది. నరేంద్ర మోడీ స్టేడియం చివరి నాలుగు ఐపీఎల్ సీజన్ లో ఫైనల్ కు ఆతిధ్యం ఇవ్వడం ఇది నాలుగో సారి. షెడ్యూల్ ప్రకారం మొదట ఐపీఎల్ ఫైనల్ కోల్ కతా లో జరగాల్సి ఉంది. కానీ కోల్ కతాలో భారీ వర్షాల కారణంగా ఐపీఎల్ 2025 ఫైనల్ వేదికను అహ్మదాబాద్ కు మార్చాల్సి వచ్చింది.