ఐపీఎల్ సీజన్ లో బెట్టింగ్ రాయుల్లు చెలరేగిపోతున్నారు. అక్రమంగా కోట్ల రూపాయల్లో సంపాదిస్తున్నారు. తాజాగా కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిదిలోని కుత్బుల్లాపూర్ లో బెట్టింగ్ కు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు మాదాపూర్ పోలీసులు. నిందుతుల వివరాలను కొనగంటి హరీన్ చైతన్య (34), మెహర్ చౌదరి(29), మాడాల అవనేంధ్ర (29), డేగల రాజేష్ (35) డీసీపీ శ్రీనివాస రావు వెల్లడించారు.
నిందితుల దగ్గరనుంచి మహీంద్రా ఎక్స్ యూవీ కారు, 19 సెల్ ఫోన్లు, 2 ల్యాప్ టాప్ లు, కమ్యూనికేటర్ బోర్డు, రూ. 20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం వస్తువుల విలువ రూ. 48 లక్షలు ఉంటుందని బాలానగర్ డీసీబీ శ్రీనివాస రావు వెల్లడించారు. నిందుతులను డీసీపీ ఆఫీసుకు తరలించి విచారణ చేపట్టారు.
