V6 News

ఐపీఎల్‌‌ కొత్త ఫ్రాంచైజీ @ రూ. 1500 కోట్లు!

ఐపీఎల్‌‌ కొత్త ఫ్రాంచైజీ @ రూ. 1500 కోట్లు!
న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌ అంటేనే కాసుల వర్షం. ఆట పరంగా, ఆదాయం పరంగా.. వరల్డ్‌‌ క్రికెట్‌‌లో ఏ లీగ్‌‌ కూడా దీనికి సాటిరాదు. అలాంటి ఐపీఎల్‌‌లో కొత్త ఫ్రాంచైజీని దక్కించుకోవాలంటే కూడా భారీ మొత్తాన్ని చెల్లించాల్సిందే. 2022 నుంచి రెండు కొత్త ఫ్రాంచైజీలను తీసుకొస్తున్న నేపథ్యంలో.. ఒక్కో ఫ్రాంచైజీ విలువ దాదాపు రూ. 1500 కోట్లకు పైగానే ఉండనుందని బీసీసీఐ వర్గాల సమాచారం. రెండు ఫ్రాంచైజీల కోసం ఏప్రిల్‌‌లో టెండర్లను పిలిచే అవకాశం ఉంది. ‘కనీస ధరను ఇంకా నిర్ణయించలేదు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూస్తే ఐపీఎల్‌‌ బ్రాండ్‌‌, మిగిలిన ఫ్రాంచైజీల విలువ వేల కోట్లలో ఉంది. కొత్త ఫ్రాంచైజీ ధర రూ. 15–16 వందల కోట్ల మధ్య ఉండొచ్చు. 2018లోనే ఢిల్లీ టీమ్​లో 50 శాతం వాటాను జేఎస్‌‌డబ్ల్యూ రూ. 1100 కోట్లకు కొనుగోలు చేసింది. కాబట్టి రేట్‌‌ ఇంకా పెరగొచ్చు కూడా’ అని బీసీసీఐలోని ఓ అధికారి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆఫీసుల తీరు మారాలి సోషల్ మీడియాలో ఆడవాళ్లపై పెరిగిన వేధింపులు రూ.50 లక్షల లోపు ఇండ్లకు ఫుల్ డిమాండ్