
ప్లాస్టిక్ ను వాడరాదంటూ ట్విట్టర్ లో ఓ చిన్నారి పెట్టిన వీడియోను పోస్ట్ చేశారు ఐపీఎస్ ఆఫీసర్, ఉమన్ సేఫ్టీ ఐజీ స్వాతి లక్రా. ప్రజలు ప్లాస్టిక్ ను విరివిగా వాడుతున్న ఈ పరిస్థితుల్లో పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిది అంటూ ఆమె గుర్తు చేశారు.
తూర్పు గోదావరి జిల్లా ఏనుగుపల్లి గ్రామానికి చెందిన మహి అనే ఓ ఏడేళ్ల చిన్నారి ఈ మధ్య ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. “షాపింగ్ చేసేటప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్ లు, కవర్లను డబ్బులిచ్చి కొంటుంటారు.. అలా చేయొద్దు.. షాపింగ్ కోసం కాటన్ బ్యాగ్ ను కేటాయించండి. వాడిన తర్వాత దాన్ని భద్రపరుచుకోండి” అని ఆ చిన్నారి వీడియోలో తెలిపింది. అలా చేస్తే పర్యావరణాన్ని కాపాడిన వాళ్లం అవుతామని చెప్పింది. ఈ పోస్ట్ ను స్వాతి లక్రా రీట్వీట్ చేశారు. చిన్న పిల్లలే ప్లాస్టిక్ కవర్స్ వాడొద్దు అని చెప్తుంటే మనం చెయ్యలేమా అంటూ మరో ట్వీట్ చేశారు.
If this little girl can……why can't we????@SAVEENERGYMAHI https://t.co/n3rSVRl3yx
— Swati Lakra IPS (@IGWomenSafety) June 17, 2019