V6 News

హార్మూజ్ బ్లాకేడ్పై ఇరాన్ సెటైర్.. షారూఖ్ మూవీ డైలాగ్తో అమెరికాకు వార్నింగ్

హార్మూజ్ బ్లాకేడ్పై ఇరాన్ సెటైర్.. షారూఖ్ మూవీ డైలాగ్తో అమెరికాకు వార్నింగ్

ఇరాన్ నావికా దళాన్ని దాదాపు నాశనం చేశాం.. హర్మూజ్ ను మేమే బ్లాక్ చేస్తాం.. జలసంధి నుంచి నౌకలు బయటకు రావటం గానీ, లోపలికి వెళ్లటం కానీ మేమే నిషేధిస్తాం.. మొత్తం దిగ్బంధిస్తాం.. మిగతా దళాలను కూడా మట్టుబెడతాం.. అంటూ ట్రంప్ చేసిన కామెంట్స్ పై ఇరాన్ సెటైరికల్ గా స్పందించింది. ట్రంప్ పెద్ద జోక్ చేశాడంటూ వ్యంగ్యంగా స్పందించింది. 

ఇండియాలో ఉన్న ఇరాన్ కాన్సులేట్ జనరల్ హార్మూజ్ జలసంధి కంట్రోల్ పై చేసిన సెటైరికల్ ట్వీట్ వైరల్ గా మారింది. షారుఖ్ ఖాన్ సినిమా డైలాగ్ తో రిప్లై ఇచ్చారు. బ్రో.. మా నావికా దళాలను మట్టుబెట్టడం గురించి మరిచిపో.. ఎవరు కంట్రోల్ చేస్తారో హార్మూజ్ డిసైడ్ చేస్తుంది అంటూ ట్వీట్ చేశారు

1980 యుద్దంలో సద్ధాం హుస్సేన్ కు మద్ధతిచ్చి.. అమెరికా ఒత్తిడికి, బెదిరింపులకు తట్టుకుని నిలబడింది. ఇరాన్, ఇరాక్ పై అమెరికా ట్యాంకర్లతో దాడి చేసినా ఎదుర్కొని గల్ఫ్ లో తన స్థానమేంటో పదిలపరుచుకుంది.  2026 లో కూడా సేమ్.. కాకపోతే కొత్త యాక్టర్స్.. బాకీ సబ్ ఫిల్మీ డైలాగ్ హై బాస్.. అంటూ షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ డైలాగ్ ను కోట్ చేశారు. 

  • పిక్చర్ అభీ బాకీ హై:

ఆ తర్వాత మరో పోస్టులో పర్షియన్ గల్ఫ్ లోని రెడ్ బీస్.. అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ర్యాపిడ్ ఫైర్ ఇరాన్ మిస్సైల్స్ ఆకాశంలోకి ఎగురుతూ, సముద్రం మీద పరిగెడుతూ.. అలలపైన విన్యాసాలు చేస్తూ ముందుకు సాగుతున్నట్లుంటుంది. ఇరాన్ నేవీ కొలాప్స్ అయిందని ట్రంప్ చెప్పడం విడ్డూరం. మా నేవీ చూడు ఎలా దూసుకెళ్తుందో అన్నట్లుగా ట్వీట్ చేశారు. 

నేవీ కుప్పకూలటం కాదు.. మా దండు ఎంత త్వరగా మిమ్మల్ని కట్టడి చేయగలదో మీరే చూస్తారు అంటూ పోస్ట్ చేశారు.  అభి తో సిర్ఫ్ ట్రైలర్ హై, పిక్చర్ అభి బాకీ హై (అది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది అంటూ పోస్ట్ చేశారు.