కోమాలో ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుప్రీం లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొజ్తబా ఖమేనీ.. పరిస్థితి అత్యంత విషమం..!

కోమాలో ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుప్రీం లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొజ్తబా ఖమేనీ.. పరిస్థితి అత్యంత విషమం..!

టెహ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం కోమాలో ఉన్నారని, దవాఖానలో చికిత్స పొందుతున్నారని సమాచారం. తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లోనే తీవ్రంగా గాయపడిన మొజ్తబా (56) ప్రస్తుతం ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పవిత్ర నగరమైన కోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చికిత్స పొందుతున్నారని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని, అపస్మార స్థితిలో కీలక నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉన్నారని ‘ది టైమ్స్’ పత్రిక ఒక  సంచలన కథనాన్ని ప్రచురించింది. 

‘‘మొజ్తబా ఖమేనీ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆయన కోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వపరమైన నిర్ణయాలు ఏవీ తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఆయన ఉన్నారు” అని కథనం పేర్కొన్నది. ఈ సమాచారం అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థల ద్వారా గల్ఫ్ దేశాలకు చేరినట్టు తెలుస్తున్నది. సుప్రీం లీడర్ ఆచూకీ అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలకు కొంతకాలంగా తెలిసినప్పటికీ.. ఈ విషయాన్ని ఇప్పటివరకూ బహిర్గతం చేయలేదు. ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ ఉన్నారనే విషయం బహిర్గతం కావడం ఇదే తొలిసారి.  

కోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు..!

గత ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ భౌతికకాయాన్ని కోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఖననం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ది టైమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కథనం వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఒకటి కంటే ఎక్కువ సమాధులకు చోటు ఉండేలా ఒక భారీ సమాధి మందిరాన్ని (మౌసోలియం) నిర్మించే పనులు వేగంగా సాగుతున్నట్టు అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. దీన్నిబట్టి ఇతర కుటుంబ సభ్యులను కూడా అక్కడే ఖననం చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది. 

మొజ్తబా ఖమేనీపై ఇరాన్ ప్రకటన..

పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన తొలిరోజే జరిగిన వైమానిక దాడిలో మొజ్తబా తండ్రి, తల్లి, భార్య జహ్రా హద్దాద్ -అడెల్, ఆయన కుమారుల్లో ఒకరు మరణించారు. అదే దాడిలో మొజ్తబా తీవ్రంగా గాయపడినట్టు ఇరాన్ గతంలోనే ధ్రువీకరించింది. సుప్రీం లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మొజ్తబా బాధ్యతలు చేపట్టినప్పటికీ.. నాటి నుంచి ఆయన ఒక్కసారి కూడా బహిరంగంగా కనిపించలేదు. కొత్త సుప్రీం లీడర్ పాలనా బాధ్యతలను సక్రమంగానే నిర్వర్తిస్తున్నారని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.