ఐర్లాండ్‌‌తో ఇండియా రెండో టీ20

ఐర్లాండ్‌‌తో ఇండియా రెండో టీ20
  • నేడు ఐర్లాండ్‌‌తో ఇండియా రెండో టీ20
  • శాంసన్‌‌, అర్షదీప్​, త్రిపాఠికి చాన్స్‌‌!
  • ఉమ్రాన్‌‌, సూర్యపై అందరి ఫోకస్‌‌
  • రా. 9 నుంచి సోనీ నెట్‌‌వర్క్‌‌లో

డబ్లిన్‌‌‌‌: తొలి మ్యాచ్‌‌‌‌లో ఐర్లాండ్‌‌‌‌పై ఘన విజయం సాధించిన హార్దిక్‌‌‌‌ పాండ్యా కెప్టెన్సీలోని ఇండియా సిరీస్​పై గురి పెట్టింది. మంగళవారం రాత్రి జరిగే రెండో, చివరి టీ20లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అదే సమయంలో ఉమ్రాన్‌‌‌‌ మాలిక్‌‌‌‌ వంటి యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌ తమ టాలెంట్‌‌‌‌ నిరూపించుకోవాలని ఆశిస్తోంది. ఆదివారం రాత్రి జరిగిన తొలి టీ20లో ఇండియా ఏడు వికెట్లతో ఐర్లాండ్‌‌‌‌ను ఓడించింది. 12 ఓవర్లకు కుదించిన ఈ పోరులో ఐర్లాండ్‌‌‌‌ ఇచ్చిన 109 రన్స్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ను హార్దిక్‌‌‌‌సేన సులువుగా ఛేజ్‌‌‌‌ చేసింది. ఓపెనర్‌‌‌‌గా వచ్చిన దీపక్‌‌‌‌ హుడాతో పాటు ఇషాన్‌‌‌‌, హార్దిక్‌‌‌‌ ఆకట్టుకున్నారు. కాలి పిక్క గాయం వల్ల యంగ్‌‌‌‌ ఓపెనర్‌‌‌‌ రుతురాజ్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌కు రాలేదు. అతని ప్లేస్‌‌‌‌లో ఈ మ్యాచ్‌‌‌‌లో సంజూ శాంసన్‌‌‌‌ బరిలోకి దిగొచ్చు. ఐపీఎల్‌‌‌‌లో రాజస్తాన్‌‌‌‌ రాయల్స్‌‌‌‌ను ఫైనల్‌‌‌‌ చేర్చిన శాంసన్‌‌‌‌ బ్యాట్‌‌‌‌తోనూ ఆకట్టుకున్నాడు. అనుభవం ఉన్నప్పటికీ అతనికి  నేషనల్‌‌‌‌ టీమ్‌‌‌‌లో సరైన అవకాశాలు రావడం లేదని ఇప్పటికే చాలా విమర్శలు ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌‌‌‌ తుది జట్టులో చోటు దక్కితే బ్యాట్‌‌‌‌తో సత్తా చాటడానికి శాంసన్‌‌‌‌ సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు ఐపీఎల్‌‌‌‌లో సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ తరఫున అదరగొట్టిన రాహుల్‌‌‌‌ త్రిపాఠి కూడా తొలి చాన్స్‌‌‌‌ కోసం ఎదురు చూస్తున్నాడు. అతనికి చాన్స్‌‌‌‌ ఇస్తారో లేదో చూడాలి.  ఇక, ఐపీఎల్‌‌‌‌లో అయిన గాయం నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చిన మిడిలార్డర్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ సూర్య కుమార్‌‌‌‌  తొలి టీ20లో గోల్డెన్‌‌‌‌ డకౌటై నిరాశ పరిచాడు. ఈ నేపథ్యంలో రెండో పోరులో బ్యాట్ ఝుళిపించాలని అతను పట్టుదలగా ఉన్నాడు.  ఇక, తన తొలి ఇంటర్నేషనల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో యంగ్‌‌‌‌ పేసర్‌‌‌‌ ఉమ్రాన్‌‌‌‌ మాలిక్‌‌‌‌ ఎక్కువ రన్స్‌‌‌‌ ఇచ్చుకున్నాడు. అయినప్పటికీ అతనిపై కెప్టెన్‌‌‌‌ హార్దిక్‌‌‌‌ భరోసా ఉంచాడు. తను పాత బాల్‌‌‌‌తో బాగా బౌలింగ్‌‌‌‌ చేస్తాడని, పవర్‌‌‌‌ ప్లే తర్వాత అతడిని బరిలోకి దింపుతామని చెప్పాడు. 

ఈ నేపథ్యంలో ఉమ్రాన్​ ఈ మ్యాచ్‌‌‌‌లోనూ ఆడటం ఖాయమే. దీన్ని అతను సద్వినియోగం చేసుకోవాలి. పేస్‌‌‌‌కు కొంచెం వైవిధ్యం కూడా జోడిస్తే మాలిక్‌‌‌‌ ఖచ్చితంగా వికెట్లు పడగొడతాడు. ఇక, తొలి మ్యాచ్‌‌‌‌లో ఫెయిలైన  అవేశ్‌‌‌‌ ఖాన్​ ప్లేస్‌‌‌‌లో యంగ్​ పేసర్​ అర్షదీప్‌‌‌‌ను బరిలోకి దింపే అవకాశం లేకపోలేదు. బౌలింగ్‌‌‌‌లో సీనియర్​ పేసర్​ భువనేశ్వర్​, స్పిన్నర్​ చహల్‌‌‌‌ సత్తా చాటుతున్నారు. మరోవైపు తొలి మ్యాచ్‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌లో రాణించిన ఐర్లాండ్‌‌‌‌ ఈసారి బంతితోనూ మెప్పించి సిరీస్‌‌‌‌ సమం చేయాలని అనుకుంటోంది. అది జరగాలంటే జట్టు సమష్టిగా రాణించాల్సి ఉంది.  ఆదివారం పవర్‌‌‌‌ హిట్టింగ్‌‌‌‌తో ఆకట్టుకున్న హ్యారీ టెక్టర్‌‌‌‌పై మరోసారి అందరి దృష్టి నెలకొంది. ఇక, ఈ మ్యాచ్‌‌‌‌ కూడా వర్ష సూచన ఉంది.