కంగనా పోస్టులు విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయ్

కంగనా పోస్టులు విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయ్

న్యూఢిల్లీ: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలకు దిగాడు. సోషల్ మీడియాలో కంగనా పెట్టే పోస్టులు విద్వేషాన్ని పెంచే విధంగా ఉన్నాయని ఆయన మండిపడ్డాడు. 'నేను దేశ ప్రజల మంచితోపాటు మానవత్వంతో కూడిన ట్వీట్లు చేస్తుంటా. దేశం తరఫున ఆడాను కాబట్టి ఆ దృక్పథం నుంచి పోస్టులు పెడతా. కానీ మరోవైపున నాకు కౌంటర్ గా పోస్టులు పెట్టే కంగనా లాంటి వారి అకౌంట్ లు తొలగించబడుతున్నాయి. కంగనాతోపాటు  మరికొందరి పెయిడ్ అకౌంట్లు కేవలం విద్వేషాన్నే వ్యాప్తి చేస్తున్నాయి' అని పఠాన్ పేర్కొన్నాడు. కాగా, రీసెంట్ గా కంగనా అకౌంట్ ను ట్విట్టర్ శాశ్వతంగా తొలగించింది.