మెడల్ కావాలంటరు.. ఫిజియోను ఏర్పాటు చేయరా?

మెడల్ కావాలంటరు.. ఫిజియోను ఏర్పాటు చేయరా?


టోక్యో: విశ్వక్రీడలకు అంతా సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రతిష్టాత్మక ఒలింపిక్ గేమ్స్ కు తెరలేవనుంది. మునుపటి కంటే మెరుగైన ప్రదర్శనతో మెడల్స్ లిస్ట్ ను పెంచుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. కొన్ని నెలలుగా చెమటోడ్చుతున్న అథ్లెట్లు పతకాలతో సగర్వంగా స్వదేశానికి తిరిగి రావాలని భావిస్తున్నారు. కుస్తీలో మెడల్ ను ఒడిసి పట్టాలని వినేశ్ ఫోగట్   పట్టుదలగా ఉంది. 

పతకం గెలవాలని తమపై ఆశలు, ఒత్తిడి ఉందన్న వినేశ్.. ఏర్పాట్ల విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేసింది. 'భారత్ నుంచి నలుగురు మహిళా రెజ్లర్లం టోక్యోలో పోటీపడబోతున్నాం. అయితే మాకు ఫిజియో థేరపిస్ట్ కావాలని అడిగాం. కానీ ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. ఒక్క అథ్లెట్ కు ఇద్దరు ముగ్గురు కోచ్ లు, స్టాఫ్ ఉంటే ఏం కాదు గానీ మాకో ఫిజియోను మాత్రం ఇవ్వరు' అని వినేశ్ మండిపడింది. తమ నుంచి పతకాలను మాత్రం ఆశిస్తారని ఫైర్ అయ్యింది. ఫిజియో కావాలని అడగడం పెద్ద తప్పుగా మారిందని అసహనం వ్యక్తం చేసింది.