KKR vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పంజాబ్.. ఓడితే ఇంటికే

KKR vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పంజాబ్.. ఓడితే ఇంటికే

ఐపీఎల్ లో నేడు (ఏప్రిల్ 26) ఆసక్తి సమరం జరగనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఇకపై ప్రతి మ్యాచ్ కీలకమే. ఇప్పటివరకు టోర్నీలో 7 మ్యాచ్ లు ఆడిన కేకేఆర్ 5 మ్యాచ్ ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. మరో వైపు పంజాబ్ ఆడిన 8 మ్యాచ్ ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో 9 స్థానంలో ఉంది. 

నేటి మ్యాచ్ ఓడిపోతే పంజాబ్ ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమిస్తుంది. ఓ వైపు  కేకేఆర్ గెలిచి ప్లే ఆఫ్ కు దగ్గరవ్వాలని చూస్తుంటే.. మరోవైపు పంజాబ్ ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ రేస్ లో ఉండాలని భావిస్తుంది. 

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):

ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, దుష్మంత చమీర, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్ (కెప్టెన్) , రిలీ రోసోవ్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్