
ఒకప్పుడు భారత క్రికెట్ లో సిక్సర్ల సిద్దూ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక కపిల్ శర్మ షోతో బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరించాడు. ఈ షోలోసిద్దూ కామెడీ స్కిట్లు ఆడియన్స్ ని కట్టిపడేశాయి. కానీ అనుకోకుండా నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఐదేళ్ల క్రితం ఈ షో నుంచి తప్పుకున్నాడు. అయితే మళ్ళీ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కపిల్ శర్మ షో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సిద్దూ ఫ్యాన్స్ అనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక చిన్న వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో తన సంతకం కుర్చీపై కూర్చున్నట్లు చూడవచ్చు. గతంలో జడ్జిగా వ్యవహరించిన సిద్దు ఈసారి తన సతీమణి నవజోత్ కౌర్ సిద్ధూతో కలిసి అతిథిగా వచ్చారు. వీరితోపాటూ హర్భజన్ సింగ్ మరియు అతని భార్య గీతా బస్రా కూడా గెస్ట్ గా వచ్చి కపిల్ షోలో సందడి చేశారు. ఈ వీడియోకి సిద్దూ "ది హోమ్ రన్" అనే క్యాప్షన్ పెట్టారు. దీంతో ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఈ షోలో కపిల్ శర్మ హోస్ట్ గా వ్యవహరిస్తుండగా అర్చన పురాన్ సింగ్, సునీల్ గ్రోవర్, కికు శారదా, కృష్ణ అభిషేక్, రాజీవ్ ఠాకూర్, తదితరులు జడ్జిగా, ఇతర తారాగణంగా ఉన్నారు. ఈ షో ప్రముఖ ఓటిటి అయిన నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతోంది.