
జపాన్‌లో 5 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడడం, శక్తివంతమైన భూకంపాలతో అట్టుడుకుతున్న తరుణంలో.. కొన్ని కీలక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సముద్ర అలజడులు భారత్‌కు సునామీ ముప్పును కలిగిస్తాయా అనే ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై తాజాగా హైదరాబాద్‌లోని ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ (ITEWC) వివరణ ఇచ్చింది. భూకేంద్ర ప్రాంతానికి సమీపంలో సముద్ర మట్ట మార్పులను పర్యవేక్షించే ITEWC ప్రకారం, భారతదేశానికి సునామీ ముప్పు లేదు.
జపాన్‌లోని మధ్య భాగంలో సంభవించిన శక్తివంతమైన భూకంపాల కారణంగా అనేక ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. రష్యా ఫార్ ఈస్ట్ కోసం సునామీ హెచ్చరిక జారీ కాగా.. అంతకుముందు జపాన్ వాతావరణ సంస్థ (JMA) దేశంలోని పశ్చిమ తీరంలో ఇషికావా, ఫుకుయ్, నీగాటా, టొయామా, యమగటా లాంటి ఇతర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. జనవరి 1న 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంతో, సెంట్రల్ జపాన్‌లోని సముద్ర తీరంలో తీవ్ర అలజడి నెలకొంది. ఇక ప్రస్తుతం రష్యా, జపాన్‌లలో హెచ్చరికలు కొనసాగుతున్నప్పటికీ, భారత్‌కు ఎలాంటి సునామీ హెచ్చరిక లేదు.
2004లో భారతదేశాన్ని తాకిన చివరి సునామీ, సముద్రగర్భంలో సంభవించిన భూకంపం.. 14 దేశాలపై ప్రభావం చూపింది. భారతదేశంతో పాటు శ్రీలంక, మాల్దీవులు లాంటి ఇతర దేశాలలో లక్షలాది మంది ప్రజలు ప్రభావితమవడంతో డిసెంబర్ 26ను బాక్సింగ్ డే సునామీ అని పిలుస్తున్నారు. ఈ సంఘటన తర్వాతే, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ 2007 అక్టోబర్‌లో హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS)లో ITWSని స్థాపించింది.