గాంధీ హాస్పిటల్​లో ఐసోలేషన్​ వార్డులు రెడీ

గాంధీ హాస్పిటల్​లో ఐసోలేషన్​ వార్డులు రెడీ

పద్మారావునగర్, వెలుగు:  కరోనా ఒమిక్రాన్​కు చెందిన సబ్​ వేరియంట్​ జేఎన్-–1  విషయంలో  దీర్ఘాకాలిక వ్యాధుల పేషెంట్లు జాగ్రత్తగా ఉండాలని   గాంధీ హాస్పిటల్​ సూపరింటెండెంట్​ ప్రొఫెసర్ ​రాజారావు సూచించారు.  మంగళవారం ఆయన ‘వెలుగు’తో మాట్లాడారు. వేగంగా వ్యాప్తి చెందే జేఎన్​-–1 సబ్ ​వేరియంట్​ వైరస్​ ప్రాణాంతకం కాకపోయినా, క్యాన్సర్, టీబీ లాంటి దీర్ఘకాల వ్యాధుల పేషెంట్లు, వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, శానిటైజర్​ వాడాలని పేర్కొన్నారు. జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు లక్షణాలు ఉంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు. గాంధీలో క్యాజువాలిటీ, మెయిన్​ బిల్డింగ్​లోని లేబర్​ వార్డులో ఐసోలేషన్​ వార్డులు రెడీగా ఉన్నాయన్నారు. ఎమర్జెన్సీ కొవిడ్​ పేషెంట్లకు ట్రీట్ మెంట్ అన్ని వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచామని తెలిపారు.