హైదరాబాద్‌‌లో ఐసాల్వ్ డ్ జీసీసీ

హైదరాబాద్‌‌లో ఐసాల్వ్ డ్ జీసీసీ

హైదరాబాద్​, వెలుగు: హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌‌మెంట్ (హెచ్​సీఎం) సొల్యూషన్లను అందించే అమెరికా సంస్థ ఐసాల్వ్​డ్​ హైదరాబాద్‌‌లో మంగళవారం గ్లోబల్​ కేపబిలిటీ సెంటర్​ను​(జీసీసీ) ప్రారంభించింది. ఇంజనీరింగ్ ఆవిష్కరణలు, ప్రాడక్ట్ డెవలప్‌‌మెంట్ కోసం ఇండియాను వ్యూహాత్మక కేంద్రంగా మార్చడంలో భాగంగా ఈ విస్తరణ చేపట్టారు. ఈ 28 వేల చదరపు అడుగుల కొత్త ఆఫీసు కోసం 2027 చివరి నాటికి 400 మందిని నియమించుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వల్లభి, ఐసాల్వ్ సీఓఓ ప్రగ్యా గుప్తా ప్రారంభించారు.  హెచ్ఆర్ సమస్యల పరిష్కారానికి, పేరోల్, టాక్స్ ప్రాసెసింగ్ వంటి పనులను మరింత వేగంగా పూర్తి చేయడంలో ఈ సెంటర్​ కీలక పాత్ర పోషిస్తుందని ప్రజ్ఞ తెలిపారు.