తలపై రాడ్డుతో కొట్టి.. ఇస్రో సైంటిస్ట్ దారుణ హత్య

తలపై రాడ్డుతో కొట్టి.. ఇస్రో సైంటిస్ట్ దారుణ హత్య

హైదరాబాద్ లోని అమీర్ పేటలో దారుణం జరిగింది. ఇస్రో అనుబంధ సంస్థ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలో సైంటిస్ట్ గా పని చేస్తున్న సురేశ్ దారుణ హత్యకు గురయ్యారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాడ్డుతో తలపై కొట్టి చంపేశారు.

అమీర్ పేట ధరమ్ కరమ్ రోడ్డులోని అన్నపూర్ణ అపార్టుమెంట్ లోని రెండో ఫ్లోర్ లోని తన నివాసంలో ఆయన్ని దుండగులు హత్య చేశారు. ఆయన్ని చంపేసి బయటి నుంచి తలుపు వేసి వెళ్లిపోయారు.

ఎస్సార్ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలను సేకరించారు. వెస్ట్ జోన్ ఇన్ చార్జి డీసీపీ సుమతి అక్కడికి వెళ్లి పరిశీలించారు.