సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్‌‌‌‌‌‌ ప్రకటించడం స్టార్ట్ చేసిన ఐటీ కంపెనీలు

 సెప్టెంబర్ క్వార్టర్  రిజల్ట్స్‌‌‌‌‌‌ ప్రకటించడం స్టార్ట్ చేసిన  ఐటీ కంపెనీలు

న్యూఢిల్లీ: ఈ వారం నుంచి  ఐటీ కంపెనీలు  సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2) రిజల్ట్స్‌‌‌‌‌‌ను ప్రకటించడం స్టార్ట్ చేయనున్నాయి. నేడు టీసీఎస్ రిజల్ట్స్ ఉన్నాయి. ఆ తర్వాత హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌ టెక్‌‌‌‌, విప్రో (ఈ నెల 12 న), ఇన్ఫోసిస్, మైండ్ ట్రీ (ఈ నెల 13 న) లు కూడా తమ రిజల్ట్స్ ప్రకటించనున్నాయి. యూఎస్‌‌‌‌, యూరప్‌‌‌‌లోని పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నప్పటికీ దేశ ఐటీ కంపెనీల రెవెన్యూ నిలకడగానే ఉంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు. కానీ, రానున్న క్వార్టర్లలో వీటి గ్రోత్ స్లో అవ్వొచ్చని లేదా వీటి క్లయింట్లు బలహీనంగా మారొచ్చని పేర్కొన్నారు. యూఎస్‌‌‌‌కు చెందిన చాలా కంపెనీలు ఈ ఏడాది వేల మంది ఉద్యోగులను తొలగించాయనే రిపోర్ట్‌‌‌‌లు వస్తున్నాయి. యూరప్‌‌‌‌, యూఎస్‌‌‌‌కి చెందిన కంపెనీలు దేశంలోని ఐటీ కంపెనీలకు అవుట్ సోర్సింగ్ ప్రాజెక్ట్‌‌‌‌లను ఇవ్వడాన్ని కొనసాగిస్తాయా? లేదా? అనే అంశంపై ప్రస్తుతం డిబేట్ నడుస్తోంది.  గత కొన్ని క్వార్టర్లతో పోలిస్తే దేశ ఐటీ ఇండస్ట్రీకి డిమాండ్ తగ్గినా, ఇంకా మంచి పొజిషన్‌‌‌‌లోనే ఉన్నామని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్ దాస్ పాయ్​ అన్నారు. ‘చాలా యూఎస్ కంపెనీలు తమ ఉద్యోగులను తీసేయడం చూస్తున్నాం. ఈ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలనుకుంటే ఇండియన్ ఐటీ కంపెనీలకు అవుట్‌‌‌‌ సోర్సింగ్ జాబ్స్‌‌‌‌ ఇవ్వడం పెరుగుతుంది. ఇండియా మంచి పొజిషన్‌‌‌‌లో ఉంది. ఒక వేళ డిమాండ్ పెరిగితే  ఐటీ కంపెనీలకు కూడా డిమాండ్ పెరుగుతుంది. అదే డిమాండ్ పడిపోతే ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఇండియన్ కంపెనీలకు అవుట్ సోర్సింగ్ చేసుకోవడం పెరుగుతంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఈ వారం మార్కెట్ ..
ఈ వారం దేశ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌లను  టీసీఎస్‌‌‌‌, ఇన్ఫోసిస్‌‌‌‌ కంపెనీల క్వార్టర్లీ రిజల్ట్స్ నడిపించనున్నాయి. వీటికి అదనంగా  ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ డేటా, ఇండస్ట్రీయల్  ప్రొడక్షన్ డేటా కూడా ఈ వారం విడుదల కానుంది. ఈ మాక్రో ఎకనామిక్ డేటా ప్రభావం మార్కెట్‌‌‌‌లపై ఉంటుంది. మరోవైపు డాలర్ మారకంలో రూపాయి కదలికలను కూడా ట్రేడర్లు ట్రాక్‌‌‌‌ చేయనున్నారు. ‘ఐఐపీ, సీపీఐ, డబ్ల్యూపీఐ వంటి కీలకమైన మాక్రో ఎకనామిక్ డేటాను మార్కెట్ ట్రేడర్లు జాగ్రత్తగా గమనించనున్నారు. వీటికి అదనంగా ఈ వారంలోనే టీసీఎస్‌‌‌‌, ఇన్ఫోసిస్‌‌‌‌, హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌ టెక్‌‌‌‌, విప్రో వంటి పెద్ద టెక్ కంపెనీల క్వార్టర్లీ రిజల్ట్స్‌‌‌‌ కూడా ఉన్నాయి.  మరో రెండు ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లు అయిన బజాజ్ ఆటో, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ రిజల్ట్స్ కూడా ఈ వారమే వెలువడనున్నాయి’ అని రిలయన్స్ రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. యూఎస్ మార్కెట్ల కదలికలను, ఎఫ్‌‌‌‌ఐఐల ట్రెండ్‌‌‌‌ను, రూపాయి మూవ్‌‌‌‌మెంట్‌‌‌‌ను, క్రూడాయిల్ ధరలను కూడా ట్రేడర్లు ఫాలో అవుతారని చెప్పారు.   కిందటి వారం సెన్సెక్స్ 764 పాయింట్లు పెరిగింది.