సచిన్ టెండుల్కర్ తన అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించి ఈ రోజుకి 9 ఏండ్లు

సచిన్ టెండుల్కర్ తన అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించి ఈ రోజుకి 9 ఏండ్లు

ప్రపంచ క్రికెట్ ఆటగాల్లంతా తనముందు మోకరిల్లింది ఈ రోజే..
యావత్ క్రికెట్ అభిమానులను కంటతడి పెట్టించిందీ ఈ రోజే..
గాడ్ ఆఫ్ క్రికెట్ గా పేరుగాంచి, ఒక శకానికి ముగింపు పలికింది ఈ రోజే...
తిరగ రాయలేని రికార్డులను నెలకొల్పి, గ్రౌండ్ కి కన్నీటితో వీడ్కోలు చెప్పిందీ ఈ రోజే...

 

 

 

లిటిల్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ తన 24 ఏండ్ల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానానికి  రిటైర్మెంట్ ప్రకటించి ఈ రోజుకి 9 ఏండ్లు.

ఏప్రిల్ 24,1973లో ముంబైలో జన్మించిన సచిన్, 1989లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. టెస్ట్, వన్డే, టీ20 కెరీర్ లో మొత్తం 664 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన సచిన్,  34,357 పరుగులు చేశాడు. అందులో 100 సెంచరీలున్నాయి.

ఈ ప్రయాణంలో చెప్పలేని గొప్ప ఇన్నింగ్స్ లు ఎన్నో ఉన్నాయి. ఆస్ట్రేలియాపై ఆడిన 144 ఇన్నింగ్స్ లో 50 సగటుతో 6,707 రన్స్ చేశాడు. అందులో 20 సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియా జట్టుపై ఏ ఆటగాడు ఇన్ని రన్స్ చేయలేదు.

సచిన్ టెండుల్కర్ కెరీల్ లో 1998 ముఖ్యమైన సంవత్సరం. ఆ ఏడాది 42 ఇన్నింగ్స్ లో 68.67 సగటుతో 2541 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు ఉన్నాయి. 
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డలపై టెస్ట్ క్రికెట్ లో 50 యావరేజ్ మెయిన్ టైన్ చేసిన ఆటగాడు సచిన్ ఒక్కడే. 2003లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన వరల్డ్ కప్ లో 11 మ్యాచ్ ల్లో 89.25 సగటుతో 673 పరుగులు చేశాడు. 

ఇలాంటి తిరుగులేని క్రికెట్ ఆడిన సచిన్, 2013 నవంబర్ 16న తన హోం గ్రౌండ్ అయిన వాంఖెడే స్టేడియంలో వెస్టిండీస్ తరుపున తన ఆకరి టెస్ట్ మ్యాచ్ ఆడి క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. ఆ మ్యాచ్ లో 74 నాలుగు పరుగులు చేశాడు సచిన్.