పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు మార్చడం మంచిదే

పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు మార్చడం మంచిదే

బీజేపీ ఎమ్మెల్సీ రామ్ చందర్ రావు

హైదరాబాద్: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు మార్చడం మంచి పరిణామమని బీజేపీ ఎమ్మెల్సీ రామ్ చందర్ రావు అన్నారు. మండలి లో జీహెచ్ఎంసీ సవరణ చట్టం పై ఆయన స్పందించారు. మహిళా రిజర్వేషన్లు పెంచడం మంచి పద్ధతే… అలాగే బీసీ రిజర్వేషన్లు కూడా పెంచాలన్నారు. ముస్లింలకు విద్య, ఉద్యోగాలలో మాత్రమే  బీసీ-ఈ రిజర్వేషన్లు తీసుకువచ్చారు కానీ.. రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం వలన నిజమైన బీసీ లు నష్టపోతున్నారని పేర్కొన్నారు. కార్పొరేటర్లను ఏవిధంగా తొలగిస్తారో… వార్డు మెంబర్లను ఏవిధంగా నియమిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే లైబ్రరీలను అభివృద్ధి చేయాలని.. హైదరాబాద్ లో సులభ్ తరహా టాయిలెట్లను ఎక్కువ సంఖ్యలో నిర్మించాలన్నారు. వీధి చివర.. తోపుడు బండ్లపై వ్యాపారాలు నిర్వహించుకుంటున్న వారికి జీవన ఆధారం కల్పించాలన్నారు. అంబర్ పేట ఫ్లై ఓవర్ విషయంలో ఓ వ్యక్తి అక్కడ మత పరమైన ప్రార్ధనా మందిరాలు లేవని ఆఫిడవిట్ ఇచ్చారు.. తన సొంత స్థలం కోల్పోయినoదుకు నష్ట పరిహారం కూడా పొందాడు కాబట్టి అక్కడ ఉన్న నిర్మాణాలను తొలగించి ఫ్లై ఓవర్ ను వెంటనే నిర్మించాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు.