ప్రభుత్వమే అల్లర్లను ప్రోత్సహించిందని అనుమానం

ప్రభుత్వమే అల్లర్లను ప్రోత్సహించిందని అనుమానం

రాజకీయంగా మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దమ్ములేక.. అప్రదిష్టపాలు చేయాలన్న  నీచమైన కుట్రతోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అల్లర్లు సృష్టించారని  మాజీ మంత్రి , బీజేపీ లీడర్ ఈటెల రాజేందర్ అన్నారు.  ప్రభుత్వాల్లో ఉన్న వారు, బాధ్యత గలిగిన రాజకీయ పార్టీలు ఎక్కడ కూడా హింసను ప్రోత్సహించవన్నారు.  రాజకీయాల్లో ప్రజల హృదయాను గెలుచుకోవాలన్నారు.  ప్రజాక్షేత్రంలో పలుకుబడి కోల్పోయినటువంటి కొన్ని పార్టీలు..అసహనంతో ప్రజలను ఇబ్బంది పెట్టడం దుర్మార్గమైన చర్య మండిపడ్డారు.  శాంతియుతంగా కొందరు నిరసన తెలపాలని వస్తే..వారిలో సంఘ విద్రోహ శక్తులు చొరబడి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారన్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా, నిఘా ఉంటుందన్న ఈటెల.. ఇలాంటి ప్రాంతాల్లో..అల్లర్లు జరగడం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. నిరసనల గురించి ముందే తెలిసినా..కంట్రోల్ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం..పట్టించుకోకుండా వాటిని ప్రోత్సహించిందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ఆందోళనకారుల రూపంలో విధ్వంసం సృష్టించిందని భావిస్తున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈటెల రాజేందర్  కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపకపోతే.. సీబీఐ ద్వారా విచారణ చేయించాలని కేంద్రాన్ని కోరతామని తెలిపారు. అటు   అగ్నిపథ్ పథకం వల్ల  నిరుద్యోగుల భవిష్యత్కు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఈటెల రాజేందర్ వెల్లడించారు. ఒక వేళ దీనిపై అభ్యంతరాలంటే కేంద్రప్రభుత్వంతో చర్చలు జరిపాలని సూచించారు.  మోదీ ప్రభుత్వం ప్రజా కోణంలో ఆలోచిస్తుందని చెప్పారు. ప్రజలు వ్యతిరేకించిన చట్టాలు, ప్రజలు ఇబ్బందులు పడే చట్టాలను గతంలో రద్దు చేసిన సంద్భరాలున్నాయన్నారు.