అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే బాధ్యత ప్రజలందరిది : మోదీ

అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే బాధ్యత ప్రజలందరిది : మోదీ

2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే బాధ్యత ప్రజలందరిపై ఉందని ప్రధాని మోదీ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా 'నవ్ మత్తత సమ్మేళన్' కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఓటర్లుగా నమోదు చేసుకోని వారు అప్లై చేయవలసిందిగా కోరారు. శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని జరుపుకునే సందర్భంగా ఓటర్లుగా నమోదు చేసుకోకపోతే వారిని ప్రోత్సహించే రోజు ఇదని చెప్పారు.
 
  ప్రభుత్వ వేగం, దిశ, విధానం ఓటర్లు నిర్ణయిస్తారని మోదీ చెప్పారు.  ప్రజాస్వామ్య ప్రక్రియలో కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు అత్యంత కీలకంగా మారారని అన్నారు. రానున్న 25 ఏళ్లలో భారత్‌ భవిష్యత్తును ప్రజలే నిర్ణయించుకోవాలని తెలిపారు.  ప్రజలు విశ్వసనీయత గురించి మాట్లాడతారు కానీ అవినీతి గురించి, విజయగాథలు గురించి, స్కాంల గురించి కాదని అన్నారు.

  భారతదేశం  ఇంతకుముందు బలహీనమైన ఐదు ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉండేదని కానీ నేడు భారత్ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలుస్తుందని అన్నారు.