బీజేపీ, బీఆర్ ఎస్ కలిసే పోటీ చేస్తయి: మంత్రి శ్రీధర్ బాబు

బీజేపీ, బీఆర్ ఎస్ కలిసే పోటీ చేస్తయి: మంత్రి శ్రీధర్ బాబు

 

చేవెళ్ల, వెలుగు : దేశ భవిష్యత్ ను పునర్నిర్మించేందుకు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ కు చాలా కీలకమని ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ రెవెన్యూలోని జేపీఎల్  కన్వెన్షన్ లో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అధ్యక్షత చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు . ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా కష్టపడి పనిచేశారో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అలాగే పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. చేవెళ్ల ఎంపీ సీటు గెలిచి తీరాలన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో పేదలకు ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వలేదని ప్రశ్నించారు. మతప్రాదిపదికన రాజకీయం చేస్తున్న బీజేపీ మాటలను నమ్మొద్దన్నారు.  బీజేపీ, బీఆర్ఎస్ మరోసారి కలిసి పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందిరమ్మ గ్రామ, మండల, జిల్లా కమిటీలను అతిత్వరలో వేస్తామన్నారు. పార్టీకోసం పనిచేసిన వారికి అవకాశం కల్పిస్తామన్నారు.   జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి,  పరిగి, తాండూరు, ఇబ్రహీంపట్నం  ఎమ్మెల్యేలు రాంమోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. 

పాలనలో మార్పు తెచ్చేలా ముందుకెళ్లాలి

ఎల్​బీనగర్ : మార్పు తీసుకువచ్చే బాధ్యత తమపై ఉందని, పరిపాలనలో కూడా తీసుకువచ్చే విధంగా ఒక కార్యాచరణ తీసుకురావాలని అధికారులకు సూచిస్తున్నామని జిల్లా ఇన్ చార్జ్ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం రంగారెడ్డి  జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్ శశాంక పాల్గొన్నారు. జడ్పీ చైర్ పర్సన్ అనితా హరినాథ్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. జిల్లా పంచాయతీ శాఖ, మైనింగ్ శాఖ,వ్యవసాయ శాఖ, సంక్షేమ శాఖ, విద్యుత్ శాఖ, వివిధ శాఖలకు సంబంధించి సమీక్షించారు.